https://oktelugu.com/

‘ఆర్యన్ ఖాన్’ ను మత్తులోకి దించింది ఈ హీరోయినే !

  Aryan Khan asked Ananya Pandey : బాలీవుడ్ సూపర్ స్టార్  ‘షారుక్ ఖాన్’   కొడుకు  ‘ఆర్య‌న్ ఖాన్‌’ రేవ్‌ పార్టీలో  డ్రగ్స్‌ తీసుకుంటూ  అడ్డంగా బుక్  అయిన సంగతి తెలిసిందే. అయితే,  ఈ డ్రగ్స్‌ కేసులో  ఆర్య‌న్ ఖాన్‌ తో పాటు ఎనిమిది మందిని ఎన్‌.సీ.బీ అధికారులు విచారించిన సంగతి కూడా తెలిసిందే.  అయితే,  ఆ విచారణలో  హీరోయిన్ అనన్య పాండే పేరు కూడా బాగా వినిపించింది అని బాగా ప్రచారం జరిగింది.    దాంతో ఎన్‌సీబీ అధికారులు అనన్య పాండేను పిలిపించి విచారించారు. ఈ […]

Written By:
  • Shiva
  • , Updated On : October 23, 2021 / 08:50 AM IST
    Follow us on

     

    Aryan Khan asked Ananya Pandey : బాలీవుడ్ సూపర్ స్టార్  ‘షారుక్ ఖాన్’   కొడుకు  ‘ఆర్య‌న్ ఖాన్‌’ రేవ్‌ పార్టీలో  డ్రగ్స్‌ తీసుకుంటూ  అడ్డంగా బుక్  అయిన సంగతి తెలిసిందే. అయితే,  ఈ డ్రగ్స్‌ కేసులో  ఆర్య‌న్ ఖాన్‌ తో పాటు ఎనిమిది మందిని ఎన్‌.సీ.బీ అధికారులు విచారించిన సంగతి కూడా తెలిసిందే.  అయితే,  ఆ విచారణలో  హీరోయిన్ అనన్య పాండే పేరు కూడా బాగా వినిపించింది అని బాగా ప్రచారం జరిగింది. 

     

    Aryan Khan

    దాంతో ఎన్‌సీబీ అధికారులు అనన్య పాండేను పిలిపించి విచారించారు. ఈ విచారణలో ఆమె సమాధానాలు క్లారిటీగా లేవు అని తెలుస్తోంది.  డ్రగ్స్   తాను ఎప్పుడూ తీసుకోలేదని చెబుతున్న ఆమె,  మరి డ్రగ్ డీలర్స్ తో ఎందుకు మాట్లాడిందో మాత్రం చెప్పడం లేదు. అయినా డ్రగ్స్ తీసుకోలేదు అని చెబితే ఎలా నమ్మాలి ?పైగా ఆమె పై ఉన్న ప్రధాన  ఆరోపణ  షారుక్‌ ఖాన్‌ కొడుకు  ఆర్యన్‌ ఖాన్‌ కు డ్రగ్స్‌ కొనుగోలు కోసం ఆమె సహాయం చేసింది అని.

     

    Ananya Pandey

    Ananya Pandey and Aryan Khan

    అయితే అనన్య మాత్రం ఆర్యన్‌ ఖాన్‌ కు డ్రగ్స్‌ కొనుగోలు కోసం తాను ఎప్పుడూ సహాయం చేయలేదని చెబుతుంది. కానీ   ముంబై క్రూయిజ్‌ లో మాదక ద్రవ్యాలు పట్టుబడిన కేసుతో ఆమెకు సంబంధం ఉంది అంటున్నారు.  అందుకు సంబంధించి  ఆర్యన్‌ ఖాన్‌ తో రెండేళ్ల క్రితం నుంచే వాట్సాప్‌ లో  కమ్యూనికేట్  జరుపుతుందని,   ఆ మెసేజ్ ల  తాలూకు ఆధారాలు కూడా  అధికారుల వద్ద ఉన్నాయని తెలుస్తోంది.

     

    మెయిన్ గా  2018–19లో ఆర్యన్ ఖాన్ కు  డ్రగ్స్‌ డీలర్ల నంబర్లు ఇచ్చిందని ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి.  పైగా  స్టార్‌ హీరోల పిల్లల గెట్‌ టుగెదర్‌ పార్టీలలో  ఆర్యన్‌ ఖాన్‌ కి అనన్య డ్రగ్స్‌ కూడా  సరఫరా చేసిందని  ఎన్‌సీబీ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి కేసు వచ్చి అనన్య మెడకు చుట్టుకుంది.  అయితే, షారుఖ్ ఫ్యాన్స్ మాత్రం ఆర్యన్ ఖాన్ ను మత్తులోకి దించింది  ఈ హీరోయినే అంటూ విమర్శలు చేస్తున్నారు.