T20 World Cup 2026 Schedule: మరి కొద్ది నెలల్లో పురుషుల టి20 వరల్డ్ కప్ మొదలు కాబోతోంది. భారత్, శ్రీలంక జట్లు ఈ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.. 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ ట్రోఫీకి సంబంధించి ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో టీమిండియా కు అన్ని మంచి శకునములు కనిపిస్తున్నాయి. సహ ఆతిథ్య దేశం శ్రీలంకకు మాత్రం కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది. ఐసీసీ రూపొందించిన షెడ్యూల్లో శ్రీలంక, ఒమన్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్ ఉన్నాయి.. మరోవైపు భారత్ ఉన్న గ్రూపులో పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమిబియా, యూఎస్ఏ ఉన్నాయి. ప్రతి పూల్ నుంచి రెండు జట్లు సూపర్ 8 దశకు అర్హత సాధిస్తాయి..
మొత్తం 20 జట్లు టి20 వరల్డ్ కప్ కోసం పోటీ పడుతున్నాయి. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉన్నాయి.. భారత్ తన తొలి మ్యాచ్ యూఎస్ఏ తో ఆడుతుంది. ఆ తర్వాత నమిబియా, పాకిస్తాన్, జట్లతో తన లీగ్ మ్యాచ్లు ఆడుతుంది. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కొలంబో వేదికగా నిర్వహిస్తారు.. భారత దేశంలో ముంబై, కోల్ కతా, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాలలో టి20 క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తారు.. శ్రీలంకలోని కొలంబో, కాండీ నగరాలలో మ్యాచ్లు నిర్వహిస్తారు. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఫైనల్లోకి వస్తే.. శ్రీలంకలో ఆ మ్యాచ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఫైనల్ దాకా రాకుంటే అహ్మదాబాద్ వేదికగా ఆ మ్యాచ్ నిర్వహిస్తారు.. ముంబై, కోల్ కతా నగరాలలో సెమి ఫైనల్ మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఒకవేళ పాకిస్తాన్ కనుక సెమీఫైనల్ లోకి వస్తే కొలంబో లో ఆ మ్యాచ్ నిర్వహిస్తారు.. ప్రతి పూల్ నుంచి రెండు జట్లు సూపర్ 8 కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత సెమీఫైనల్.. అనంతరం ఫైనల్ చేరుకుంటాయి..
ఇప్పటికే నాలుగు గ్రూపులుగా జట్లను విభజించిన ఐసీసీ నవంబర్ 25న డ్రా నిర్వహిస్తోంది. ఆ డ్రా ప్రకారం మ్యాచ్ లు జరుగుతాయి.. టి20 వరల్డ్ కప్ నిర్వహణ కోసం బీసీసీఐ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.. 20 దేశాలకు సంబంధించిన ప్లేయర్లు వస్తున్న నేపథ్యంలో వారికి అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. పాకిస్తాన్ మాత్రం కొలంబో వేదికగా మ్యాచులు ఆడుతుంది. పాకిస్తాన్ ప్లేయర్లు తమ స్వదేశం నుంచి నేరుగా శ్రీలంకలో దిగుతారు. అక్కడే వారు ప్రాక్టీస్ మొదలుపెడతారు. టి20 వరల్డ్ కప్ లో టీమిండియా కు సూర్య కుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తాడు.. సూర్య నాయకత్వంలో టీమిండియా ఇంతవరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. చివరికి ఆస్ట్రేలియా పై కూడా t20 కప్ సాధించి టీమిండియా సంచలనం సృష్టించింది. స్వదేశంలో ట్రోఫీ జరుగుతుంది కాబట్టి.. పైగా టీమ్ ఇండియా డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో దిగుతోంది కాబట్టి.. కచ్చితంగా విజేత అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.