IND Vs NZ: న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా మూడవ వన్డే ఆడుతోంది. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఐదు పరుగులకే ఇన్ని న్యూజిలాండ్ ఓపెనర్లను కోల్పోయింది. హర్షిత్, అర్ష్ దీప్ చెరో వికెట్ సాధించారు.
ఇండోర్ వేదిక టీమిండియా కు పెట్టని కోట లాంటిది. ఈ వేదికపై టీమిండియా ఏకంగా 7 వన్డేలు ఆడింది. ఒక దాంట్లో కూడా ఓటమి ఎరగకుండా జైత్రయాత్ర కొనసాగించింది. ఆదివారం కూడా అదే రిపీట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇండోర్ మైదానం పేరు చెప్పగానే అభిమానుల మదిలో కచ్చితంగా వీరేంద్ర సేవకు పేరు మెదులుతుంది. 14 సంవత్సరాల క్రితం ఇక్కడ డిసెంబర్ 8న వెస్టిండీస్ జట్టుతో టీమిండియా వన్డే మ్యాచ్ ఆడింది. నాటి మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ 149 బంతుల్లోనే 219 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్లో రెండవ డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. వీరేంద్ర సెహ్వాగ్ ఇన్నింగ్స్ లో 25 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. టీమ్ ఇండియాకు సారధిగా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ సృష్టించిన ఈ రికార్డు.. నేటికీ భద్రంగానే ఉంది. ఈ ఘనతను ఏ అంతర్జాతీయ జట్టు కెప్టెన్ సాధించలేకపోయాడు.
నాటి మ్యాచ్లో టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 418 పరుగులు చేసింది. మెన్స్ వన్డే ఫార్మేట్ లో టీమిండియా కు ఇదే హైయెస్ట్ స్కోర్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 153 పరుగుల వ్యత్యాసంతో విజయం సాధించింది. సిరీస్ కూడా సొంతం చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 2017లో శ్రీలంకపై 208* పరుగులు చేశాడు. అప్పుడు టీమిండియాకు అతడు సారధిగా ఉన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డుకు దగ్గరగా వచ్చినప్పటికీ.. దానిని మాత్రం అధిగమించలేకపోయాడు.
ఆదివారం జరుగుతున్న మ్యాచ్ లో మరో విశేషం కూడా ఉంది. విరాట్, రోహిత్ ఈ మ్యాచ్ తర్వాత.. మరో ఆరు నెలల పాటు టీమిండియాలో కనిపించరు. టీమిండియా జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్ ఆడుతుంది. అప్పటిదాకా రోహిత్, విరాట్ మైదానంలో కనిపించరు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్లో రోహిత్, విరాట్ అదరగొడతారని అభిమానులు భావిస్తున్నారు. వారిద్దరి నుంచి భారీ ఇన్నింగ్స్ ను ఆశిస్తున్నారు. విరాట్, రోహిత్ భీకరమైన ఫామ్ లో ఉన్నప్పటికీ.. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండవ వన్డేలో ఆకట్టుకోలేకపోయారు.
