https://oktelugu.com/

South Africa: ఒత్తిడిని జయించారు.. సెమీస్ చేరారు.. సౌతాఫ్రికా మారిందోచ్

South Africa: టి20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా జట్టు నేపాల్ పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.. అంతకు ముందు జరిగిన లీగ్ మ్యాచ్ లలో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 24, 2024 / 12:27 PM IST

    South Africa enter semi-final

    Follow us on

    South Africa: దక్షిణాఫ్రికా జట్టుకు చోకర్ అనే పేరుంది. అంటే ఆ జట్టు ఆటగాళ్లు ఎప్పుడు ఎలా ఆడతారో ఎవరికీ తెలియదు. అద్భుతమైన ఫీల్డింగ్, పెరిగిన బ్యాటింగ్, చురుకైన బౌలింగ్ చేస్తారని పేరున దక్షిణాఫ్రికా ఆటగాళ్లు.. గత కొంతకాలంగా స్థిరత్వం లేకుండా ఆడుతున్నారు. కలిస్, పొలాక్, కిర్ స్టెన్ గిబ్స్ వంటి ఆటగాళ్లతో అద్భుతమైన జట్టుగా అలరారిన దక్షిణాఫ్రికా.. నేడు పడుతూ, లేస్తూ ప్రయాణం కొనసాగిస్తోంది. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఆశించినంత స్థాయిలో అటతీరు ప్రదర్శించలేకపోయింది. అయితే టి20 వరల్డ్ కప్ కు వచ్చేసరికి ఒక్కసారిగా ఆట తీరును మార్చేసుకుంది. సూపర్ -8 లో ఇంగ్లాండ్ జట్టుపై నాటకీయ పరిణామాల మధ్య విజయం సాధించిన సౌతాఫ్రికా.. ఆతిథ్య వెస్టిండీస్ జట్టుపై ఉత్కంఠ మధ్య గెలుపును దక్కించుకొని సెమీస్ వెళ్ళిపోయింది..

    టి20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా జట్టు నేపాల్ పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.. అంతకు ముందు జరిగిన లీగ్ మ్యాచ్ లలో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ.. నేపాల్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో తీవ్ర ఒత్తిడికి గురైంది. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో విజయాన్ని దక్కించుకుంది. అయితే ఈ ప్రదర్శనతో దక్షిణాఫ్రికా జట్టు సూపర్ -8 లో రాణించలేదని, ఆశించిన స్థాయిలో ప్రతిభ చూపకుండా వెంటనే తిరిగి వెనక్కి వచ్చేస్తుందని అందరూ భావించారు.

    విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ దక్షిణాఫ్రికా అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. సూపర్ -8 లో ఆడిన మూడు మ్యాచ్లలో విజయాలు సాధించి దర్జాగా సెమీస్ వెళ్ళిపోయింది. సూపర్ -8 లో తొలి మ్యాచ్లో అమెరికాపై విజయం సాధించిన దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చివరి వరకు పోరాడింది. ఏడు పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. ఇక వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ సౌత్ ఆఫ్రికా సమష్టి తత్వాన్ని ప్రదర్శించింది.. మూడు వికెట్ల తేడాతో గెలుపును సాధించింది. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ -3 టేబుల్ టాపర్ గా ఆవిర్భవించింది.

    దక్షిణాఫ్రికా జట్టులో షంసీ, రబాడా, మార్క్రం, కేశవ్ మహారాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు.. ఇక బ్యాటింగ్ లో డికాక్, మార్క్రం, స్టబ్స్, హెండ్రిక్స్, జాన్సన్ వంటి వారు మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నారు.. కీలక సమయంలో జట్టుకు అవసరమైన పరుగులు అందిస్తూ, విజయ పథంలో నడుపుతున్నారు. ఫలితంగా దక్షిణాఫ్రికా వరుస విజయాలతో సత్తా చాటుతోంది.. అంతేకాదు టైటిల్ ఫేవరేట్ జట్ల విభాగంలో ముందు వరుసలో నిలుస్తోంది. అయితే ఆ జట్టు ఆట తీరు పట్ల దక్షిణాఫ్రికా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఐసీసీ నిర్వహించిన ఏ మెగా టోర్నీ కూడా గెలవని దక్షిణాఫ్రికా.. ఈసారి టి20 వరల్డ్ కప్ సాధించాలని బలంగా కోరుకుంటున్నారు.. కెప్టెన్ మార్క్రం తన అనుభవంతో జట్టును అన్ని విభాగాల్లో ముందుండి నడిపిస్తున్నాడు. ఆటగాళ్లు ఒత్తిడిలో సమర్థవంతంగా ఆడేలా తర్ఫీదు ఇస్తున్నాడు. చివరికి తానే స్వయంగా బౌలింగ్ వేస్తూ.. ప్రత్యర్థి ఆటగాళ్లను ఇబ్బంది పెడుతున్నాడు.

    ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో.. సౌత్ ఆఫ్రికా విజయంపై ఎవరికీ నమ్మకం లేదు. చివరికి ఆ జట్టు ఆటగాళ్లకు కూడా.. కానీ మార్క్రం ఏమాత్రం ఆశలు కోల్పోకుండా చివరి వరకు పోరాడాడు. బౌలర్లలో స్ఫూర్తిని నింపి.. ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు లివింగ్ స్టోన్, బ్రూక్ ను వెంట వెంటనే అవుట్ చేయించి.. సామ్ కరణ్ ను ఒత్తిడిలోకి నెట్టి.. సౌత్ ఆఫ్రికా విజయాన్ని ఖాయం చేశాడు. వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ అదే సూత్రాన్ని పాటించాడు. ఇంగ్లాండ్ తర్వాత.. తన జట్టును సెమిస్ లోకి పంపించాడు. ఒకప్పుడు ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సౌత్ ఆఫ్రికా జట్టు.. ప్రస్తుతం వరుస విజయాలతో అభిమానుల మన్ననలు అందుకుంటోంది.