Homeక్రీడలుక్రికెట్‌T20 World Cup 2024: భారత్ తో మ్యాచ్ అంటే మాపై ఒత్తిడి ఉంటుంది... పాక్...

T20 World Cup 2024: భారత్ తో మ్యాచ్ అంటే మాపై ఒత్తిడి ఉంటుంది… పాక్ కెప్టెన్ భయపడ్డాడా?

T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ లో.. మిగతా మ్యాచ్ లు వేరు.. భారత్ – పాకిస్తాన్(India vs Pakistan) మధ్య జరిగే మ్యాచ్ వేరు. హై వోల్టేజ్ కు అసలు సిసలైన అర్థం చెప్పేలా ఈ మ్యాచ్ జరుగుతుందనడం లో ఎటువంటి సందేహం లేదు. పైగా దాయాది దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంటే.. చూసేందుకు అభిమానులు పోటీలు పడుతుంటారు.. లైవ్ మ్యాచ్ చూసేందుకు అవకాశం లేనివారు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారు. పైగా భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను ఐసీసీ కూడా “డబ్బు” చేసుకుంటోంది. అందువల్లే మెగా టోర్నీలలో భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉండేలాగా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో గ్రూప్ – ఏ లో భారత్, పాకిస్తాన్ ఉన్నాయి. జూన్ 9న ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ జరిగే మైదానంలో టికెట్లను భారీ ధరలకు ఐసీసీ విక్రయిస్తోంది. డైమండ్ క్లబ్ విభాగంలో ఒక్కో సీటును దాదాపు 20వేల అమెరికన్ డాలర్లకు అమ్ముతోంది. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు ఒక్కో సీటు వెల 16.65 లక్షలు.

Also Read: T20 World Cup 2024: పసికూన అనుకుంటే.. వెస్టిండీస్ చుక్కలు చూపించింది..

మైదానంలో గెలుపును అందుకునేందుకు అటు పాకిస్తాన్, ఇటు భారత క్రీడాకారులు శక్తికి మించి పోరాడుతారు. వారి ఆట తీరుతో దాదాపు ఒక యుద్ధాన్ని కళ్ళ ముందు ఉంచుతారు. అందుకే టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కంటే.. భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే లీగ్ మ్యాచ్ కే ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉన్నప్పుడు క్రికెటర్లు రకరకాల విశ్లేషణలు చేస్తుంటారు. అయితే ఐసీసీ(ICC) నిర్వహించిన మెగా టోర్నీలలో పాకిస్తాన్ మీద భారత్ దే పై చేయి.. 2021లో నిర్వహించిన t20 వరల్డ్ కప్ లో భారత్ పై పాకిస్తాన్ విజయం సాధించింది. 2022 t20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై భారత్ గెలిచింది. 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లోనూ భారత్ విజయాన్ని దక్కించుకుంది.

Also Read: ICC T20 World Cup 2024 : అమెరికా, కెనడా అయితే ఏంటట.. భారత్, ఆసియా దేశాల ఆటగాళ్ళే దిక్కు

భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో అంచనాలు పెరిగిపోతాయని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ చెబుతున్నాడు.. అయితే ఈ తరహా ఒత్తిడి ఎదుర్కోవడం ఇది తొలిసారి కాదని.. ఆటలో ప్రాథమిక నిబంధనలు పాటిస్తే గెలవడం కష్టం కాదని చెబుతున్నాడు. ” భారత జట్టుతో మ్యాచ్ అంటే ఏదో తెలియని ఉద్రిక్తత ఉంటుంది. ఒత్తిడిని జయిస్తేనే ఇలాంటి హై వోల్టేజ్ మ్యాచ్లో గెలిచేందుకు అవకాశం ఉంటుంది.. మైదానంలో ప్రశాంతంగా ఉండి, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ఆటగాళ్లు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. రికార్డుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. అవి ఎలాగూ ఉండనే ఉంటాయి. మ్యాచ్ జరిగే రోజు జట్టు ప్రదర్శన ఆధారంగానే విజయావకాశాలు ముడిపడి ఉంటాయని” బాబర్ అజాం(Babar Azam) పేర్కొన్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular