IND vs BAN : బంగ్లాదేశ్ తో కీలక మ్యాచ్ కు మూడు మార్పులు.. టీమిండియా తుది జట్టు ఇదే!

IND vs BAN : టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరడానికి మరో 3 మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కీలకమైన గ్రూప్ 2లో సౌతాఫ్రికా టాప్ లో ఉండి సెమీస్ రేసులో ముంది. ఇక రెండోస్థానం కోసం భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే రేపు భారత్, బంగ్లాదేశ్ మధ్యన మ్యాచ్ విజేతలు సెమీస్ రేసులోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు చావో రేవో లాంటిది. […]

Written By: NARESH, Updated On : November 1, 2022 6:23 pm
Follow us on

IND vs BAN : టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరడానికి మరో 3 మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కీలకమైన గ్రూప్ 2లో సౌతాఫ్రికా టాప్ లో ఉండి సెమీస్ రేసులో ముంది. ఇక రెండోస్థానం కోసం భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే రేపు భారత్, బంగ్లాదేశ్ మధ్యన మ్యాచ్ విజేతలు సెమీస్ రేసులోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు చావో రేవో లాంటిది. మనం ఓడిపోతే బంగ్లాదేశ్, పాకిస్తాన్ లకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. దీంతో రేపటి కీలక పోరు కోసం భారత్ జట్టు సన్నాహాలు చేస్తోంది.

ఆడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్ తో రేపు టీమిండియా తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తేనే సెమీస్ అవకాశాలను మరింతగా పదిల పరుచుకుంటుంది. ఇక ఈ మ్యాచ్ వరుణుడు కారణంగా ఆటంకం కలిగినా కూడా భారత్ కు భారీ నష్టం తప్పదు.

ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో కీపర్ దినేష్ కార్తీక్ గాయపడ్డాడు. దీంతో బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు అతడి స్థానంలో పంత్ రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు అడిలైడ్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది కాబట్టి అదనపు పేసర్ తో భారత్ బరిలోకి దిగాలని భావిస్తోంది. అశ్విన్ స్థానంలో పేసర్ హర్షల్ పటేల్ ను తుదిజట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక దక్షిణాఫ్రికాతో ఆడిన దీపక్ హుడా మరోసారి బెంచ్ కే పరిమితం కానున్నాడు.

-భారత జట్టు చూస్తే..
రోహిత్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్

లను తుదిజట్టుగా తీసుకునేందుకు టీం మేనేజ్ మెంట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.