https://oktelugu.com/

టీ20: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా మార్పులివీ

ఇంగ్లండ్ తో 5వ టీ20 కోసం టీమిండియా సిద్ధమైంది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో అదృష్టం మరోసారి ఇంగ్లండ్ నే వరించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ మోర్గాన్ మరో ఆప్షన్ లేకుండానే బౌలింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ పిచ్ లో ఎవరైతే టాస్ గెలుస్తారో మ్యాచ్ గెలిచినట్టే అందుకే వెంటనే ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. టీమిండియా ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది. ఇక ఫామ్ కోల్పోయి వరుసగా సున్నాకే ఔట్ అవుతున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : March 20, 2021 / 07:11 PM IST
    Follow us on

    ఇంగ్లండ్ తో 5వ టీ20 కోసం టీమిండియా సిద్ధమైంది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో అదృష్టం మరోసారి ఇంగ్లండ్ నే వరించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ మోర్గాన్ మరో ఆప్షన్ లేకుండానే బౌలింగ్ ఎంచుకున్నాడు.

    అహ్మదాబాద్ పిచ్ లో ఎవరైతే టాస్ గెలుస్తారో మ్యాచ్ గెలిచినట్టే అందుకే వెంటనే ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. టీమిండియా ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది.

    ఇక ఫామ్ కోల్పోయి వరుసగా సున్నాకే ఔట్ అవుతున్న కేఎల్ రాహుల్ ను జట్టు నుంచి తాజాగా తప్పించారు. కెప్టెన్ కోహ్లీనే ఓపెనర్ గా రంగంలోకి దిగాడు. జట్టులో కేఎల్ రాహుల్ ను తప్పించి బౌలర్ నటరాజన్ ను జట్టులోకి తీసుకున్నారు. అదొక్కటే మార్పు. ఇంగ్లండ్ జట్టు సేమ్ టీంతో బరిలోకి దిగింది. ఇషాన్ కిషన్ ను గాయం కారణంగా తీసుకోలేదు.

    టీమిండియా జట్టు అంచనా: రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ (సి), రిషబ్ పంత్ (wk), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ చాహర్. నటరాజన్

    ఇంగ్లాండ్: భారత్‌తో పోల్చితే ప్రత్యామ్నాయ మ్యాచ్‌లలో ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం ఆడుతున్న జట్టు చాలా స్థిరపడినట్లు కనిపిస్తోంది. జట్టులో మెరుగైన బ్యాలెన్స్ కోసం   ఎటువంటి మార్పులు చేయకుండా అదే జట్టును కంటిన్యూ చేశారు.

    ఇంగ్లండ్ జట్టు అంచనా : జాసన్ రాయ్, జోస్ బట్లర్ (wk), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, ఎయోన్ మోర్గాన్ (సి), సామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్.