https://oktelugu.com/

స్టీల్ ప్లాంట్ ఉద్యమం.. మంత్రులతో విశాఖకు కేటీఆర్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఉరకలెత్తించేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ అయ్యారు. ఈ మేరకు ఏపీ కోసం ఉద్యమించేందుకు మంత్రుల బృందాన్ని వెంటబెట్టుకొని కదిలివస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనకు మద్దతు తెలుపడానికి తెలంగా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్.. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె టి రామారావు త్వరలోనే తన క్యాబినెట్ మంత్రుల బృందాన్ని విశాఖపట్నంకు తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు. శనివారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ […]

Written By: NARESH, Updated On : March 20, 2021 8:18 pm
Follow us on

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఉరకలెత్తించేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ అయ్యారు. ఈ మేరకు ఏపీ కోసం ఉద్యమించేందుకు మంత్రుల బృందాన్ని వెంటబెట్టుకొని కదిలివస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనకు మద్దతు తెలుపడానికి తెలంగా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్.. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె టి రామారావు త్వరలోనే తన క్యాబినెట్ మంత్రుల బృందాన్ని విశాఖపట్నంకు తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు.

శనివారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సమావేశం జరిగింది. గంటా స్వయంగా కేటీఆర్ ను ఉద్యమానికి రావాలని కోరగా.. ఈ మేరకు కేటీఆర్ వస్తానని హామీ ఇచ్చారు.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్టు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే సంఘీభావం తెలిపారు. ఆందోళనకు మద్దతుగా విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమ బాట పట్టారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జేఏసీ ఆందోళనకు తన మద్దతును అందించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే వచ్చానని.. మంత్రి కేటీఆర్ ను కలిశానని మాజీ మంత్రి గంటా తెలిపారు. “ఈ సమస్యను అధ్యయనం చేయడానికి.. ఆందోళనలో పాల్గొనడానికి త్వరలో మంత్రుల బృందంతో కలిసి విశాఖపట్నం సందర్శిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు” అని గంటా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నాయకులు చర్చలు జరిపినట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగుల కోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతును సమీకరిస్తామని గంటా తెలిపారు. అందరినీ కలుస్తానన్నారు.