Suyash Sharma Viral Pic: ఈసారి ఐపీఎల్లో ఛాంపియన్ గా నిలిచిన కన్నడ జట్టులో ఎంతోమంది ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. అందులో సుయాష్ శర్మ అనే యువ బౌలర్ కూడా ఒకడు. 2003 లో పుట్టిన ఇతడు.. ఈ ఏడాది కన్నడ జట్టులో మెరిశాడు. 22 సంవత్సరాల ఈ యువకుడు ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు.. ఈ సీజన్లో ముఖ్యంగా క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో అయ్యర్ జట్టుపై బంతితో చెలరేగిపోయాడు. 17 పరుగులు మాత్రమే ఇచ్చి అయ్యర్ జట్టులో కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు. మొత్తానికి పంజాబ్ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. ఇతడు వికెట్లు తీయడంతో పంజాబ్ జట్టు ఏ దశలోనూ భారీ స్కోరు దిశగా సాగలేకపోయింది. అందువల్లే కన్నడ జట్టు ఆ మ్యాచ్లో గెలిచి నేరుగా చివరి అంచె పోటీకి వెళ్లిపోయింది. ఒకరకంగా కన్నడ జట్టు ఛాంపియన్ గా నిలవడానికి సుయాష్ తన వంతుకు మించి పాత్ర పోషించాడు అని చెప్పవచ్చు. నాటి మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన నేపథ్యంలో శర్మపై అభినందనల జల్లు కురిసింది. చివరి అంచె పోటీలో సుయాష్ క్రికెట్లు సాధించ లేకపోయినప్పటికీ.. మెరుగైన బౌలింగ్ వేసి ఆకట్టుకున్నాడు.
సుయాష్ శర్మ కట్టుదిట్టంగా పంజాబ్ జట్టుతో జరిగిన క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో బౌలింగ్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ బీమర్ అద్భుతమైన ఫోటో రూపొందించాడు. బంతిని వేస్తున్న సమయంలో రెండు చేతులలో దాన్ని పట్టుకొని.. సుయాష్ ఏదో చదివాడని.. ఒకరకంగా మంత్రాలు వేసి బంతులు సంధించాడని.. అందువల్లే అతడికి వికెట్లు పడ్డాయని.. ఆ మీమర్ ఉద్దేశం. దీంతో ఈ ఫోటో సామాజిక మాధ్యమాలలో తెగ సర్కులేట్ అవుతోంది.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..” అయ్యర్ జట్టు పై వికెట్లు తీయడానికి ప్రధాన కారణం ఇదా? మంత్రాలు వేసి వికెట్లు నేలకూల్చావా? అందువల్లే క్వాలిఫైయర్ -1 మ్యాచ్ లో అయ్యర్ జట్టు పై విజయం సాధ్యమైందా.. నువ్వు మామూలోడి కాదు.. మంత్రాలు వేసి బౌలింగ్ చేసావంటే నువ్వు చాలా గొప్పోడివి అని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
కొంతమంది క్రికెటర్లు మాత్రం.. మంత్రాలు గింత్రాలు ఉండవని.. కేవలం హార్డ్ వర్క్ మాత్రమే ఒక ఆటగాడికి గొప్పదనాన్ని ఇస్తుందని.. అదే అతడిని చిరస్థాయిగా నిలబెడుతుందని పేర్కొంటున్నారు. శర్మ మైదానంలో తీవ్రంగా శ్రమించాడని.. వికెట్లు తీయడంలో పట్టు సాధించాడని.. అందువల్లే ఆ స్థాయిలో అయ్యర్ జట్టుపై చెలరేగిపోయాడని వ్యాఖ్యానిస్తున్నారు. అద్భుతమైన ప్రతిభ చూపిన ఆటగాడిని ప్రోత్సహించాలని.. అంతే తప్ప ఇలా మంత్రాలు చేస్తున్నాడు… క్రికెట్ లు తీయడానికి ఏవేవో పనులు చేస్తున్నాడని వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు. అవసరమైతే అతడిని ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.