Homeక్రీడలుSurya Kumar Yadhav : సూర్య కుమార్ యాదవ్ అంటే మామూలుగా ఉండదు.. టి20 వరల్డ్...

Surya Kumar Yadhav : సూర్య కుమార్ యాదవ్ అంటే మామూలుగా ఉండదు.. టి20 వరల్డ్ కప్ విన్నింగ్ క్యాచ్ ను గుర్తు చేస్తూ అభిమానులు ఏం చేశారంటే..

Surya Kumar Yadhav :  వెస్టిండీస్ వేదికగా ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై భారత జట్టు ఈడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దాదాపు 17 సంవత్సరాల నిరీక్షణకు తెరదించింది. రోహిత్ ఆధ్వర్యంలో టి20 వరల్డ్ కప్ ను సగర్వంగా ముద్దాడింది. సౌత్ ఆఫ్రికా – భారత మధ్య హోరాహోరీగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ లో విజయానికి సౌత్ ఆఫ్రికాకు 16 పరుగులు కావాల్సి వచ్చింది. చివరి ఓవర్ ను హార్దిక్ పాండ్యా వేశాడు. అప్పటికి క్రీజ్ లో ఉన్న డేవిడ్ మిల్లర్ తొలిబంతిని భారీ షాట్ కొట్టాడు.. లాఫ్టడ్ షాట్ కొట్టి బంతిని స్ట్రాన్స్ లోకి పంపించేందుకు ప్రయత్నించాడు. అది కచ్చితంగా సిక్సర్ వెళ్తుందని అందరు భావించారు.. కానీ అక్కడే అద్భుతం చోటు చేసుకుంది. బౌండరీ లైన్ వద్ద సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని పట్టేసుకున్నాడు.. దీంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఏడ్చేశాడు.. హార్దిక్ పాండ్యా ఉద్యోగానికి గురయ్యాడు. భారత అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఆ లక్ష్యాన్ని అందుకోలేక ఓటమిపాలైంది.. సూర్య కుమార్ అందుకున్న ఆ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చింది. భారత జట్టును విజేతగా ఆవిర్భవించేలా చేసింది.

ఆ మధుర క్షణాన్ని మర్చిపోలేక పోతున్నారు

భారత్ t20 వరల్డ్ కప్ అందుకొని నెలలు గడుస్తున్నప్పటికీ.. ఆ మధుర క్షణాన్ని అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పటికీ వారికి ఆ దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో.. ఓ వినాయక మండపం విశేషంగా ఆకర్షిస్తోంది. గుజరాత్ లోని వాపి ప్రాంతంలో గణేష్ మండపాన్ని టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ తరహాలో రూపొందించారు. బొమ్మల సహాయంతో నిర్వాహకులు సూర్య అందుకున్న అద్భుతమైన క్యాచ్ ను రీ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వినాయక మండపంలో రీ క్రియేట్ చేసిన అదృశ్యాలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు సూర్య కుమార్ యాదవ్ కు ఉన్న క్రేజ్ ను కొనియాడుతున్నారు. ఇదెక్కడి మాస్ రా మావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

రిషబ్ పంత్ కూడా..

సూర్య ఆ క్యాచ్ అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇటీవల.. రిషబ్ పంత్ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు. ఆ క్యాచ్ అతడు గనుక పట్టి ఉండకపోతే మ్యాచ్ స్వరూపం మరో విధంగా మారి ఉండేదని వ్యాఖ్యానించాడు.. చరిత్రలో నిలిచిపోయే విధంగా సూర్య కుమార్ యాదవ్ ఆ క్యాచ్ ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడని పంత్ ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular