Homeక్రీడలుక్రికెట్‌Gautam Gambhir Strict Selection Policy: సూర్య, అయ్యర్ తస్మాత్ జాగ్రత్త.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడు..

Gautam Gambhir Strict Selection Policy: సూర్య, అయ్యర్ తస్మాత్ జాగ్రత్త.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడు..

Gautam Gambhir Strict Selection Policy: భారత క్రికెట్ జట్టుకు శిక్షకుడిగా రాహుల్ ద్రావిడ్ కొనసాగినప్పుడు.. కొన్ని విషయాలను పట్టించుకునే వాడు కాదు. ఆటగాళ్లు కొన్ని సిరీస్ లలో విఫలమైనప్పటికీ.. అతడు చూసి చూడనట్టు వెళ్లేవాడు. అవకాశాలు ఇచ్చేవాడు. తద్వారా ప్లేయర్లు కూడా సమర్థవంతంగా ఆడేవారు. దీంతో జట్టుకు విజయాలు సాధ్యమయ్యేవి. అతడు శిక్షకుడిగా ఉన్నప్పుడే టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్స్ దాకా వెళ్ళింది. 2023 వన్డే క్రికెట్ విశ్వ సమరంలో చివరిదాకా వెళ్ళింది.

రాహుల్ ద్రావిడ్ తర్వాత గౌతమ్ గంభీర్ శిక్షకుడిగా వచ్చాడు. అతడు వచ్చిన తర్వాత జట్టు ప్రయాణం ముఖ్యంగా రెడ్ బాల్ ఫార్మేట్ లో దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఆటగాడి గురించి గౌతమ్ గంభీర్ అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. అతడు శిక్షకుడిగా వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి వారు రెడ్ బాల్ ఫార్మాట్ నుంచి దూరం జరిగారు. అశ్విన్ అయితే పూర్తిగా క్రికెట్ మొత్తానికి దూరమయ్యాడు. ఆడే విషయంలో.. పరుగులు తీసే విషయంలో.. వికెట్లను పడగొట్టే విషయంలో గౌతమ్ గంభీర్ ఏమాత్రం కాంప్రమైజ్ కాడు. అందువల్లే ఆటగాళ్లు నిత్యం భయపడిపోతూ ఉంటారు.

ఇటీవల టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత ఐపీఎల్ లోకి ప్రవేశించింది. ఐపీఎల్ లో కొంతమంది ప్లేయర్లు మాత్రమే ఆకట్టుకున్నారు. వారి ప్రదర్శనను కూడా మేనేజ్మెంట్ తదుపరి సిరీస్ లకు లెక్కలోకి తీసుకుంటుంది. ఇప్పుడు టీమ్ ఇండియా ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్.. అయ్యర్ ముంబై టీ20 లీగ్ లో ఆడుతున్నారు. వీరి ప్రదర్శన ఏమాత్రం బాగోలేదు.

ముంబై t20 లీగ్ లో ట్రీ యంప్స్ నైట్స్ ఎం ఎస్ ఈ తరఫున రంగంలోకి దిగాడు సూర్య కుమార్ యాదవ్.. నార్త్ ముంబై పాంథర్స్ జట్టు తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయాడు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. 11 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. రాహుల్ బౌలింగ్లో వైభవ్ మాలికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో నార్త్ ముంబై జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం ట్రయాంప్స్ జట్టు 188 పరుగులు మాత్రమే చేసింది.

అయ్యర్ కూడా

ముంబై ఫాల్కన్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్న అయ్యర్ ఏ ఆర్ సి ఎస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఐదు పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇతడు శివం దుబే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో ఫాల్కన్స్ జట్టు 126 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఆందేరి జట్టు కేవలం 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది.

ఐపీఎల్ లో అయ్యర్ కొన్ని మ్యాచ్ల్లో గొప్పగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత తేలిపోయాడు. మరోవైపు సూర్య కుమార్ యాదవ్ కూడా కొంత మేర మాత్రమే మెరుపులు మెరిపించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular