Suryakumar Yadav- Tilak Varma: ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ గ్రౌండ్ లో ఎంత సీరియస్ గా ఉంటాడో.. బయట అంత సరదాగా ఉంటాడు. తాజాగా సూర్య కుమార్ యాదవ్ విమానంలో ప్రయాణిస్తుండగా సహచర ఆటగాడితో చేసిన ఓ చిలిపి పని ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కెర్ల కొడుతోంది.
లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ తో క్వాలిఫైయర్-2 ఆడేందుకు ముంబై ఇండియన్స్ జట్టు అహ్మదాబాద్ చేరుకుంది. ఈ క్రమంలో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ నోరు కాస్త తెరిచి గాఢ నిద్ర చేస్తున్నాడు. ఈ సమయంలో సూర్య కుమార్ యాదవ్ ఒక చిలిపి పని చేశాడు. దీనిని వీడియో తీసిన మరో ఆటగాడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఇది పెద్ద ఎత్తున ప్రస్తుతం వైరల్ అవుతోంది. సూర్య కుమార్ యాదవ్ భలే ఆట పట్టించాడంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు.
నిమ్మరసాన్ని నోట్లో పిండిన సూర్య కుమార్ యాదవ్..
నోరు తెరిచి విమానంలో గాఢంగా నిద్రిస్తున్న తిలక్ వర్మ దగ్గరకు సూర్య కుమార్ యాదవ్ వెళ్ళాడు. విమాన సిబ్బంది దగ్గర నిమ్మకాయ తీసుకుని.. దాని రసాన్ని తిలక్ వర్మ నోట్లో పిండాడు. దీంతో తిలక్ వర్మ వెంటనే నిద్రలోంచి లేచాడు. ఏం జరిగిందా..? అని కాసేపు ఆశ్చర్యపోయి చూసాడు. ఆ తరవాత నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. వేలాదిమంది సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ ముఖ కవళికలను చూసిన పలువురు సహచర ఆటగాళ్లు నవ్వుకుంటూ కనిపించారు. సూర్య కుమార్ యాదవ్ చేసిన ఈ పని చూసి పలువురు సామాజిక మాధ్యమాల్లో తెగ జోకులు పేలుస్తున్నారు.
Chain se sona hai toh jaag jao #OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @surya_14kumar @TilakV9 MI TV pic.twitter.com/1SjiJtSSx7
— Mumbai Indians (@mipaltan) May 25, 2023