Surya Kumar Yadav And Shubman Gill: రోహిత్ నుంచి మొదలు పెడితే సూర్య కుమార్ యాదవ్ వరకు ఇప్పుడు గిల్ ను చూసి భయపడిపోతున్నారు.. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గిల్ కు మేనేజ్మెంట్ సపోర్ట్ ఫుల్ గా ఉంది. ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ అతనికి అనే విధాలుగా అండగా ఉంటున్నాడు. ప్రతి విషయంలోనూ ప్రోత్సాహం ఇస్తున్నాడు. దీంతో గిల్ శుక్ర మహర్దశ పట్టింది. అందువల్లే అతడు దూసుకుపోతున్నాడు. పాతిక సంవత్సరాల వయసులోనే టీమ్ ఇండియాను టెస్ట్, వన్డే ఫార్మాట్లో నడిపిస్తున్నాడు. త్వరలో టి20 ఫార్మాట్ పగ్గాలు కూడా అతడికి దక్కుతాయని ప్రచారం జరుగుతోంది.
టి20 ఫార్మాట్ లో గిల్ కు కెప్టెన్సీ అప్పగించే విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై తొలిసారి టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందించాడు. కెప్టెన్సీ కోల్పోతానని భయం తనలో ఉందని అన్నాడు.. టి20లలో గిల్ ను సారథిగా చేస్తారని వస్తున్న వార్తలపై అతడు స్పందించాడు.. ” నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ విషయంలో భయం ఉంది. అదే నన్ను ప్రోత్సహిస్తోంది. తీవ్రంగా సాధన చేస్తూ.. నిజాయితీని ప్రదర్శిస్తూ.. ముందుకు సాగిపోతూ ఉంటే మిగతా వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. సుదీర్ఘ ఫార్మాట్, పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో గిల్ నాయకుడు అవడం పట్ల సంతోషంగా ఉన్నాను. మా మధ్య మంచి స్నేహం ఉంది. అతడు నాతో అన్ని పంచుకుంటాడు. అందువల్లే మా ఇద్దరి మధ్య బాండింగ్ అంత బలంగా ఉందని” సూర్య కుమార్ యాదవ్ పేర్కొన్నాడు..
ఇటీవల కాలంలో సూర్య కుమార్ యాదవ్ టి20 లలో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆసియా కప్ లో విఫలమయ్యాడు. అంతకు ముందు జరిగిన సిరీస్లలో కూడా అతడు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. అందువల్లే అతడిని టి20 ఫార్మాట్ నుంచి నాయకుడిగా తప్పిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇంతవరకు మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మరోవైపు టి20 లలో ప్రదర్శన అంత గొప్పగా లేదు. ఇటీవల జరిగిన ఆసియా కప్ లో కూడా అతడు ఆకట్టుకోలేకపోయాడు. అందువల్లే టి20 బాధ్యతలు అతనికి అప్పగించే విషయంలో మేనేజ్మెంట్ వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని తెలుస్తోంది. ఒకవేళ అతడు గనుక అద్భుతమైన ప్రదర్శన చేస్తే అప్పుడు t20 బాధ్యతలు కూడా అప్పగిస్తారని తెలుస్తోంది.
ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ లో గుజరాత్ జట్టు తరఫున గిల్ అద్భుతంగా ఆడాడు. ఓపెనర్ గా సాయి సుదర్శన్ తో కలిసి బీభత్సమైన ఇన్నింగ్స్ నిర్మించాడు. పరుగుల వరద పారించాడు. అయితే అటువంటి గిల్ ప్రస్తుతం టి20 అంతగా ఆకట్టుకోలేకపోవడం జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.. అయితే ఫామ్ అనేది పెద్ద కష్టం కాదని.. టి20 లలో త్వరలోనే గిల్ తన లయను అందుకుంటాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.