Sunrisers Hyderabad : ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో.. ఆయన వెంటనే విజిలెన్స్ బృందాన్ని రంగంలోకి దింపారు. తక్షణమే తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. ఎప్పుడైతే విజిలెన్స్ బృందం రంగంలోకి దిగిందో.. అప్పుడే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాళ్ళ బేరానికి వచ్చింది. ఇబ్బందులు పెట్టబోమని.. వేధింపులకు పాల్పడమని సంకేతాలు ఇచ్చింది. దీంతో విజిలెన్స్ విభాగం సైలెంట్ అయిపోయింది. అయితే ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టనని ముఖ్యమంత్రి అప్పుడే సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే విజిలెన్స్ బృందాన్ని రహస్యంగా రంగంలోకి దింపారు. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో విజిలెన్స్ అధికారులు లోతుగా విచారణ సాగించడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇబ్బందులకు పాల్పడిందని.. వేధింపులకు గురి చేసిందని.. అదనపు టికెట్ల కోసం సన్ రైజర్స్ యాజమాన్యానికి చుక్కలు చూపించిందని తేలింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు, కార్యదర్శి ఒత్తిడి చేశారని విజిలెన్స్ ఎంక్వయిరీలో తేలింది. ఇక దీనికి సంబంధించిన ప్రైమరీ రిపోర్టును ప్రభుత్వానికి అధికారులు సబ్మిట్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి సూచించారు.
Also Read : అహ్మదాబాద్ ఫైనల్ కు ఊహించని అతిథులు.. రోమాలు నిక్కబొడిచే విశేషం చెప్పిన ఐపీఎల్ చైర్మన్!
ఈ సీజన్లో ఐపిఎల్ మొదలైన తర్వాత.. ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్ల విషయంలో తమకు ఎక్స్ ట్రా టికెట్లు ఇవ్వాలని.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు ఇబ్బందికి గురి చేస్తున్నాడని హైదరాబాద్ యాజమాన్యం ఒక లేఖ రాసింది.. ఇలానే తమన్న బెదిస్తే హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోతామని స్పష్టం చేసింది. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టిదాకా వెళ్లడంతో ఆయన విజిలెన్స్ విభాగాన్ని రంగంలోకి దింపారు. ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. నిబంధనల ప్రకారం 10 శాతం టికెట్ల కంటే.. అదనంగా మరో పది శాతం టికెట్లు కావాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒత్తిడికి గురి చేసిందని విజిలెన్స్ ఎంక్వయిరీలో తేలింది.. అయితే 10% టికెట్లు ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేయడానికి తమకు అవకాశం ఇవ్వాలని జగన్మోహన్రావు కొడితే హైదరాబాద్ యాజమాన్యం ఓకే చెప్పింది. అయితే వాటికి అదనంగా మరోపరిచారని టికెట్లు ఓపెన్ మార్కెట్లో ఇవ్వాలని జగన్మోహన్రావు హైదరాబాద్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చారు.. దీనికి సన్ రైజెస్ ఒప్పుకోలేదు.. ఇక కాంప్లిమెంటరీ బాక్స్ టికెట్ల విషయంలోనూ తనకు వచ్చే వాటా ఇవ్వలేదని జగన్మోహన్రావు కక్ష సాధింపు పాల్పడ్డారు. హైదరాబాద్ – తలపడుతున్నప్పుడు విఐపి బాక్సులకు తాళం వేశారు. దీంతో హైదరాబాద్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి లేఖ రాసింది. ఆ లేఖ బయటికి లీక్ కావడంతో ఒకసారి ఆ విషయం బయటకు వచ్చింది.. అయితే విజిలెన్స్ ఎంక్వయిరీ జరుగుతుండగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ పరస్పరం చర్చించుకున్నాయి. సమస్యను పరిష్కరించుకున్నాయి. అయితే విజిలెన్స్ ఎంక్వయిరీ పూర్తి కావడంతో మరోసారి ఈ విషయం సంచలనంగా మారింది. జగన్మోహన్రావు గత ప్రభుత్వ పెద్దలకు అత్యంత దగ్గర వ్యక్తి. పైగా అప్పట్లోనే అతడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా నియమితుడయ్యాడు. అతని వ్యవహార శైలి పై మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఆగ్రహం గానే ఉన్నారు. ఇప్పుడు విజిలెన్స్ నివేదిక నేపథ్యంలో జగన్మోహన్ రావు పై రేవంత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.