IPL 2024 – SRH : ఐపీఎల్-2024 కోసం ఈ ముగ్గురి ప్లేయర్ల మీద కన్నేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం…

వేలంలోకి గిల్ వస్తే ఎంతైనా సరే పెట్టి అతన్ని కొనడానికి హైదరాబాద్ టీం రెడీ గా ఉన్నట్టు గా తెలుస్తుంది...

Written By: Gopi, Updated On : September 30, 2023 3:42 pm

IPL 2024 - SRH

Follow us on

IPL 2024 – SRH : ఐపీఎల్ 2024 కోసం అన్ని టీములు ఇప్పటి నుంచే భారీ ప్లాన్లు వేస్తున్నట్టు గా తెలుస్తుంది.అయితే గత సీజన్ లో భారీ అంచనాలతో బరి లోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం దారుణంగా ఫెయిల్ అయింది. ఇక దానితో ఈ టీం ఇప్పుడు చాలా ప్రణాళికలను రచిస్తున్నట్టు గా తెలుస్తుంది.ఇక దీని కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలా కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నట్టు గా తెలుస్తుంది. ఇప్పటికే టీమ్ ప్రక్షాళనను ప్రారంభించిన ఆరెంజ్ ఆర్మీ.. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ 2024 మినీ వేలం కోసం ప్రణాళికలను సిద్దం చేస్తోంది. కొత్త హెడ్ కోచ్, న్యూజిలాండ్ దిగ్గజం డానియల్ వెటోరి పర్యవేక్షణలో మినీ వేలానికి సిద్దమవుతోంది.జట్టుకు భారమైన ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్దమైన ఆరెంజ్ ఆర్మీ.. రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను ఇప్పటికే రెడీ చేసింది. కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్‌తో పాటు మయాంక్ అగర్వాల్‌ను వదులుకునేందుకు హైదరాబాద్ టీమ్ సిద్దమవుతోంది. ఈ ఇద్దర్నీ వదులుకుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ మనీ పర్స్‌కు రూ.21.5 కోట్ల డబ్బు చేరనుంది.

ఈ డబ్బుతో కత్తిలాంటి యంగ్ ఆటగాళ్లను తీసుకోవచ్చని డానియల్ వెటోరి టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీమిండియా యువ స్టార్లపై అతను కన్నేసినట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మతో పాటు శుభ్‌మన్ గిల్, పృథ్వీ షాలను కొనుగోలు చేసేందుకు వెటోరి వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది.

ఈ ముగ్గురిలో ఒక్కరిని తీసుకున్నా జట్టుకు ఉపయోగపడుతుందని వెటోరి భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్, పృథ్వీ షాలు తమ ఫ్రాంచైజీలను వీడుతారని ప్రచారం జరుగుతుండటంతో వీరికి భారీ ఆఫర్ ఇచ్చి జట్టులోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో పృథ్వీ షా దారుణంగా విఫలమైన నేపథ్యంలో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకునే అవకాశం ఉంది…

ఇక పృథ్వి షా విషయం పక్కన పెడితే గిల్ లాంటి ఒక యువ ప్లేయర్ కూడా టీం లోకి వస్తే ఆయనకే కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే హైదరాబాద్ టీం కి గిల్ లాంటి ఒక ప్లేయర్ అవసరం చాలా ఉంది అని క్రికెట్ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు… వేలంలోకి గిల్ వస్తే ఎంతైనా సరే పెట్టి అతన్ని కొనడానికి హైదరాబాద్ టీం రెడీ గా ఉన్నట్టు గా తెలుస్తుంది…