Bigg Boss 7 Telugu Voting: ఇప్పటివరకు టాప్ లో ఉండి ఆ దెబ్బకు ఓటింగ్ లో లాస్ట్ కు పడిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్..

ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో మొదలై అన్ని ఉల్టా పుల్టా గానే చేస్తూ…ఆరంభం నుంచే ఉత్కంఠతతో పాటు వినోదాన్ని కూడా పంచుతోంది ఈ రియాలిటీ షో. ఇందులో భాగంగా రెండవ వారం ఎలిమినేషన్ కోసం జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియలో సరికొత్త ట్విస్ట్ షోపై మరింత ఆసక్తిని పెంచింది.

Written By: Vadde, Updated On : September 15, 2023 8:29 am

Bigg Boss 7 Telugu Voting

Follow us on

Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మాంచి థ్రిల్లర్ మూవీ కంటే కూడా ఎక్కువ థ్రిల్లింగ్గా సాగుతోంది. ఎవరు ఊహించని సరికొత్త ట్విస్టులతో ఆరంభం నుంచే కంటెస్టెన్షన్ తికమక పెడుతున్న బిగ్ బాస్.. సడెన్ షాక్ ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. ఒక్కొక్కసారి మనం ఊహించినది తలకిందులుగా జరగడంతో..బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఏమి జరుగుతోంది ప్రేక్షకులలో ఎక్కువ అవుతుంది.

ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో మొదలై అన్ని ఉల్టా పుల్టా గానే చేస్తూ…ఆరంభం నుంచే ఉత్కంఠతతో పాటు వినోదాన్ని కూడా పంచుతోంది ఈ రియాలిటీ షో. ఇందులో భాగంగా రెండవ వారం ఎలిమినేషన్ కోసం జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియలో సరికొత్త ట్విస్ట్ షోపై మరింత ఆసక్తిని పెంచింది. టాప్ స్థానాల్లో కొనసాగుతున్నారు అనుకున్న వాళ్లు కూడా డేంజర్ జోన్ లో కనిపించడం అందరికీ ఊహించని షాక్.

బిగ్ బాస్ రియాలిటీ షో చాలా భాషల్లో వస్తున్నప్పటికీ హిందీ తర్వాత ఎక్కువ ఆదరణ తెలుగు బిగ్ బాస్ కే ఉంది అని చెప్పవచ్చు. భారీ స్థాయి టిఆర్పి రేటింగ్ పలు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 7 మొదటి నుంచే మంచి టిఆర్పి మెయింటైన్ చేస్తుంది. ఎపిసోడ్ కే కాక ఎపిసోడ్ ప్రోమో కి కూడా భారీ రేటింగ్ వస్తుంది.

14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన సీజన్ మొదటి వారంలో ఆల్రెడీ ఒక కంటెస్టెంట్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక మిగిలిన 13 మందిలో రెండవ వారం నామినేషన్ ప్రక్రియలో ఏకంగా 9 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. రెండవ వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరమైన గొడవలతో…మంచి ఎంటర్టైనర్ గా సాగింది.
పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, శివాజి, అమర్‌దీప్‌లు ఈవారం నామినేషన్ లో ఉన్నారు.

అందరికంటే ఎక్కువగా విమర్శలు అందుకొని నామినేట్ అయిన వ్యక్తి పల్లవి ప్రశాంత్.. ఇక ఆ తర్వాత స్థానం హీరో శివాజీకే దక్కుతుంది. కామన్ మాన్ గా రైతుబిడ్డగా ఇంట్లోకి ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం నామినేషన్లు టాప్ లో ఉన్నాడు. మొన్న హౌస్ లో జరిగిన గొడవ అతనికి పబ్లిక్ లో కాస్త సింపతి తెచ్చింది అనడానికి అతనికి ఇప్పటివరకు నమోదైన 39% ఓట్లే నిదర్శనం. అంటే ఈవారం కూడా అతను దాదాపుగా సేఫ్ అయినట్లే లెక్క.

ఓటింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తుంది…విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రెండవ వారానికి గాను జరుగుతున్న ఓటింగ్లో ప్రిన్స్ ఆఫర్ ఏడవ స్థానంలో కొనసాగుతుండగా…శోభా శెట్టి ఎనిమిదవ స్థానంలో లాస్ట్ లో ఉందట. ఇక అందరికంటే చివరి స్థానంలో షకీలా ఉంది. అయితే ఓటింగ్ కి ఇంకా ఒకరోజు ఉండడంతో స్థానాలలో మార్పు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది పెద్ద భేతాళ ప్రశ్నే?