Homeక్రీడలుక్రికెట్‌Sunrisers Hyderabad IPL dominance: సన్రైజర్స్.. ఐపీఎల్ మొత్తాన్ని తగలబెట్టేస్తున్నారు.. ఇంతటి మార్పు వెనుక..

Sunrisers Hyderabad IPL dominance: సన్రైజర్స్.. ఐపీఎల్ మొత్తాన్ని తగలబెట్టేస్తున్నారు.. ఇంతటి మార్పు వెనుక..

Sunrisers Hyderabad IPL dominance: హైదరాబాద్ జట్టు పూర్తిగా మారిపోయింది. ఏకంగా ఐపీఎల్లో టాప్ వన్ స్థానంలోకి వచ్చేసింది. ఇంకా రెండు మ్యాచ్లు కనుక గెలిస్తే హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ వెళ్లిపోయినట్టు. హైదరాబాద్ జట్టు ఈ స్థాయిలో ఆట తీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హైదరాబాద్ కంటే గొప్ప గొప్ప జట్లు ఈ ఐపీఎల్లో ఆడుతున్నప్పటికీ.. మొదట్లో ఓటములు.. ఆ తర్వాత వరుస విజయాలతో హైదరాబాద్ జట్టు తన భవితవ్యాన్ని పూర్తిగా మార్చేసుకుంది.

వరుస విజయాలతో సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ జట్టు.. లీగ్ దశలోనే టాప్ స్థానాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ జట్టు ఫైనల్ వెళ్ళింది. గత ఏడాది కనీసం ప్లే ఆఫ్ దాకా కూడా వెళ్లలేకపోయింది. ఇక ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ జట్టు ప్రారంభ దశలో అంత గొప్పగా ఆడలేదు. దీంతో గత సీజన్ మాదిరిగానే హైదరాబాద్ జట్టు ఆట తీరుకుంటుందని అభిమానులు ఒక అంచనాకు వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ జట్టు ప్లేయర్లు పూర్తిగా మారిపోయారు.

భారీ లక్ష్యాలను చేదించడం మొదలుపెట్టారు. బ్యాటింగ్ పైనే కాదు బౌలింగ్ పిచ్ లపై అదరగొట్టారు. ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు 11 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఏడు విజయాలు నెంబర్ చేసింది. పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు.. ఆ ఒరవడి కొనసాగించాలని గట్టి నమ్మకంతో ఉంది.

అదరగొడుతున్నారు

ఐపీఎల్ లో మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ ఎవరైనా ఉన్నారంటే అది అభిషేక్ శర్మ, హెడ్ మాత్రమే. ప్రారంభంలో హెడ్ ఇబ్బందిపడ్డాడు. అంత గొప్పగా ఇన్నింగ్స్ ఆడలేదు. అతడు ఆడలేక పోయే తీరును అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ ద్వారా కవర్ చేసేవాడు. ఇప్పుడు హెడ్ కూడా అదరగొడుతున్నాడు. హైదరాబాద్ జట్టుకు కీలక దశలో అతడు ఫామ్ లోకి రావడంతో తిరుగులేకుండా పోతుంది.

త్రిమూర్తులు

ఓపెనర్లు పరుగుల బోర్డును జస్ట్ 9 ఓవర్ల కల్లా సెంచరీ మార్క్ దాటిస్తున్నారు. ఆ తర్వాత కిషన్.. క్లాసెన్ భుజాలకు ఎత్తుకుంటున్నారు. మధ్యలో నితీష్ కుమార్ రెడ్డి కూడా వస్తున్నాడు. వీరు ముగ్గురు త్రిమూర్తుల మాదిరిగా బ్యాటింగ్ చేస్తూ.. హైదరాబాద్ జట్టుకు తిరుగులేని స్థానాన్ని అందిస్తున్నారు.

మీరు మాత్రమే కాకుండా సలీల్ అరోరా, అనికేత్ వర్మ టచ్ లో ఉన్నారు. చివరి ఆర్డర్లో వీరు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ వీరికి గనుక అవకాశాలు లభిస్తే తిరుగు ఉండదు. వీరు చివరి ఓవర్లలో దుమ్ము రేపడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వీరికి అవకాశాలు అరుదుగా మాత్రమే వస్తున్నాయి.

బ్యాటింగ్లో మాత్రమే కాదు బౌలింగ్లో కూడా హైదరాబాద్ జట్టు అదరగొడుతోంది. దీనికి ప్రధాన కారణం ఇషాన్ మలింగ. పర్పుల్ క్యాప్ విభాగంలో అతడు పోటీ పడుతున్నాడు. ఇప్పటివరకు పోతాడు 16 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడిని చూసి ప్రత్యర్థి బ్యాటర్లు భయపడిపోతున్నారు అంటే.. బౌలింగ్ ఏ రేంజ్ లో వేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

గాయం వల్ల ప్రారంభ మ్యాచ్ లకు దూరంగా ఉన్న కెప్టెన్ కమిన్స్.. ఇప్పుడు సత్తా చూపిస్తున్నాడు. ఇతడు మాత్రమే కాకుండా సకిబ్ హుస్సేన్ ఇప్పటికే 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రతి మ్యాచ్లో అతడు వికెట్ పడగొడుతున్నాడు. ప్రఫుల్ హింగే 8 వికెట్లు, శివంగ్ 8 వికెట్లు, హర్ష్ 8 వికెట్లు సాధించి అదరగొడుతున్నారు.

2025 సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి అంతగా ఆడలేదు. తాను ఈసారి అతడు తిరుగులేని స్థాయిలో తన ప్రతిభను చూపిస్తున్నాడు. గత సీజన్లో 13 మ్యాచులు ఆడిన అతడు.. కేవలం 182 పరుగులు చేశాడు. రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ సీజన్లో మాత్రం పది మ్యాచ్లు ఆడిన అతడు 222 పరుగులు చేశాడు. 7 వికెట్లు పడగొట్టాడు.. ముఖ్యంగా క్లాసెన్ తో కలిసి అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నితీష్ తన తొలి ఓవర్ లోనే వికెట్ తీస్తూ.. జట్టుకు అదిరిపోయే రిలీఫ్ ఇస్తున్నాడు.

హైదరాబాద్ జట్టు 2016లో విజేతగా నిలిచింది. 2024లో ఫైనల్ దాకా వచ్చింది. పానిట్రోఫీని అందుకోలేకపోయింది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు గతంలో కంటే గొప్పగా ఫామ్ లో ఉంది. అలాంటప్పుడు ఈసారి హైదరాబాద్ జట్టు ట్రోఫీ అందుకోవాలంటే కచ్చితంగా నాకౌట్ స్టేజ్ దాకా వెళ్లాలి. ఇది జరగాలంటే మిగిలిన మూడు మ్యాచ్ల్లో కనీసం రెండిట్లో విజయాలు సాధించాలి. ఒకవేళ అన్నింట్లో విజయాలు సాధిస్తే టాప్ రెండవ స్థానంలో ఉండవచ్చు. అప్పుడు ఫైనల్ వెళ్లడానికి హైదరాబాద్ జట్టుకు రెండు అవకాశాలు లభిస్తాయి. బ్యాటింగ్ బాగున్నప్పటికీ.. బౌలింగ్ అదరగొడుతున్నప్పటికీ.. ఫీల్డింగ్ విషయంలో హైదరాబాద్ జట్టు సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. క్యాచ్ లు డ్రాప్ చేయకుండా ప్లేయర్లు ఫీల్డింగ్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Narendra Modi And Rahul Gandhi: మోడీ గేమ్ అర్థం కాలేదా రాహుల్ గాంధీ…

Narendra Modi And Rahul Gandhi: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ఈ పరిణామాలను చూసి విపక్షాలు...

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...
Oktelugu Epaper
Exit mobile version