Sunrisers Hyderabad (3)
Sunrisers Hyderabad: హోరాహోరీగా సాగుతుందనుకున్న మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమైన హైదరాబాద్ జట్టు ఏడ వికెట్ల తేడాతో గుజరాత్ జట్టుపై ఓడిపోయింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టుకు ఇది వరుసగా నాలుగవ పరాజయం. నాలుగు ఓటములు ఎదుర్కోవడంతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. వరుసగా 4 ఓటములు ఎదుర్కొని ప్లే ఆప్స్ అవకాశాలను హైదరాబాద్ జట్టు దూరం చేసుకుంటున్నది. గత సీజన్లో రన్నరప్ గా హైదరాబాద్ జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో మాత్రం హైదరాబాద్ జట్టు ఆశించినంత స్థాయిలో ఆట తీరు ప్రదర్శించలేకపోతోంది.
Also Read: 300 లోడింగ్.. సన్ రైజర్స్ కు మొదటికే మోసం!
బ్యాటింగ్ లో విఫలం
సొంత మైదానం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఏకంగా హైదరాబాద్ జట్టు 286 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. భారీ విజయంతో ఈ సీజన్ ను ప్రారంభించిన హైదరాబాద్ జట్టు.. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల చేతిలో ఓడిపోయింది. మొత్తంగా ఐదు మ్యాచ్లు ఆడి.. నాలుగు ఓటములతో పాయింట్లు పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.. బ్యాటింగ్లో హైదరాబాద్ జట్టు విఫలమవుతోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమవుతున్నారు. వీరు సరిగ్గా ఆడ లేకపోవడంతో హైదరాబాద్ జట్టు అవకాశాలను దూరం చేసుకుంటున్నది. మిగతా జట్టతో పోల్చితే అరి వీర భయంకరమైన బ్యాటర్లు ఉన్న హైదరాబాద్ జట్టు.. గడచిన నాలుగు మ్యాచ్ లలో కనీసం 200 పరుగుల స్కోర్ మార్క్ కూడా అందుకోలేకపోయింది. చెత్త బ్యాటింగ్ కు చెత్త బౌలింగ్ కూడా తోడు కావడంతో జట్టుకు విపరీతమైన నష్టం కలగజేస్తోంది. అనుభవజ్ఞుడైన స్పిన్ బౌలర్ లేకపోవడం.. జట్టుకు తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తోంది. కెప్టెన్ కమిన్స్, మహమ్మద్ షమీ విఫలమవుతున్నారు. సిమర్జిత్ సింగ్, జయదేవ్ వంటి బౌలర్లు సరైన సహకారం అందించడం లేదు. దీంతో హైదరాబాద్ జట్టు విజయావకాశాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. హైదరాబాద్ జట్టు లీక్ దశలో ఇంకో తొమ్మిది మ్యాచులు ఆడాలి. ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆప్స్ చేరుకోవాలంటే హైదరాబాద్ కనీసం 8 మ్యాచ్లలో విజయాలు సాధించాలి. ఫలితంగా 9 గెలుపులతో 18 పాయింట్లు సొంతం చేసుకుని.. హైదరాబాద్ ప్లే ఆప్స్ బెర్త్ సొంతం చేసుకుంటుంది. ఇక ఈ తొమ్మిది మ్యాచ్లలో హైదరాబాద్ రెండు ఓడిపోయిన సరే ప్లే ఆప్స్ అవకాశాలు కష్టమవుతాయి. అప్పుడు ఇతర జెట్ల ఫలితాల మీద హైదరాబాద్ ఆధార పడాల్సి ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నెట్ రన్ రేట్ ఏమాత్రం బాగోలేదు. అందువల్ల హైదరాబాద్ తదుపరి మ్యాచ్లో భారీ తేడాతో గెలవాలి. ఇక హైదరాబాద్ వరుసగా మరో మూడు మ్యాచ్ల్లో ఓడిపోతే మాత్రం అధికారికంగా ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించాల్సిందే..