Virender Sehwag- SRH: ఈ జనరేషన్ వాళ్లకు క్రికెట్ అంటే ఐపీఎల్ మాత్రమే. ఐపీఎల్ మ్యాచ్లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ 2023 మ్యాచెస్ లో హైదరాబాద్కు చెందిన సన్రైజర్స్ ఎటువంటి పేలవమైన ప్రదర్శన కనబరిచిందో అందరికీ తెలిసు. 14 మ్యాచులు ఆడితే అందులో అతి కష్టం మీద నాలుగు అంటే నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించింది. అన్ని టీమ్స్ తో పోలిస్తే పాయింట్స్ లిస్ట్ లో లాస్ట్ నుంచి సన్రైజర్స్ ఫస్ట్.
నిజానికి ఐపీఎల్ గురించి డిస్కషన్ వస్తే సన్రైజర్స్ హైదరాబాద్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అన్న ఒపీనియన్ వినపడుతోంది. వరుసగా మూడు సీజన్స్ లు పాటు కన్సిస్టెంట్గా చెత్త ప్రదర్శన ఇవ్వడమే కాకుండా దారుణమైన విమర్శలను ఎదుర్కొంటుంది సన్రైజర్స్. టీం ప్లేయర్స్ సెలక్షన్ దగ్గర నుంచి కోచ్ వరకు ఏ ఒక్క అంశం కూడా ఈ టీం కి కలిసి రావడం లేదు. ఈ నేపథ్యంలో తమ టీం లో పెను మార్పులు తీసుకురావడానికి సన్రైజర్స్ హైదరాబాద్ సిద్ధపడ్డట్టు సమాచారం.
ఇక ఈసారి కూడా ఇలాగే ఉంటే కష్టమని రాబోయే ఐపీఎల్ మ్యాచ్ కోసం ఇప్పటినుంచి సన్రైజర్స్ యాజమాన్యం కసరత్తులు మొదలు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన బ్రియాన్ లారాను తప్పించబోతున్నట్లు తెలుస్తోంది. మాజీ టీం ఇండియన్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను సన్రైజర్స్ టీం ప్రధాన కోచ్‌గా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సహవాగ్ , సన్రైజర్స్ టీం మధ్యలో చర్చలు జరుగుతున్నాయి.
మరోపక్క ప్రస్తుతం సన్రైజర్స్ జట్టులో హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న లారా విండీస్ జట్టును మెరుగుపరిచే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి సన్రైజర్స్ హెడ్ కోచ్ పదవిపై అతనికి ఎటువంటి ఆసక్తి ఉన్నట్టు కనిపించడం లేదు.. అతను విండీస్ హెడ్ కోచ్ అండీ కొలీ తో కలిసి వెండిస్ టీంకు ఓ మంచి సలహాదారుడిగా ఉండాలి అని అభిప్రాయపడుతున్నడట. దీంతో అతనిపై వేటు కన్ఫామ్ అని తెలుస్తుంది.
ప్రస్తుతం సన్రైజర్స్ ఉన్న పరిస్థితుల్లో టీం మెరుగుపడాలి అంటే సెహ్వాగ్ లాంటి అనుభవం ఉన్న సీనియర్ క్రికెట్ ప్లేయర్ హెడ్ కోచ్‌గా రావాల్సిందే. పంజాబ్ టీం కి నాలుగు సంవత్సరాలు మెంటర్ గా వ్యవహరించిన సెహ్వాగ్ ఈ పని చేయడానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. అంతేకాకుండా తన కెరీర్లో ఎన్నో ఐపిఎల్ మ్యాచెస్ ఆడిన అనుభవం ఉండనే ఉంది. అందుకే సన్రైజర్స్ ఎలాగైనా ఈసారి సెహ్వాగ్‌ను తమ హెడ్ కోచ్‌గా తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. అయితే కొంతమంది మాత్రం ప్రస్తుతం సన్రైజర్స్ కు గిల్క్రిస్ట్ లాంటి కోచ్ అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సన్రైజర్స్ డెసిషన్ ఏమిటి అనేది త్వరలోనే తెలుస్తుంది.
.
Web Title: Sunrisers hyderabad crucial decision virender sehwag as head coach
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com