Sun Risers Hyderabad : మొత్తంగా ఇటీవల కాలంలో చెన్నై వేదికగా జరిగిన ఐదు మ్యాచుల్లో ఒకటి కూడా హైదరాబాద్ గెలవలేదు. దీంతో శుక్రవారం నాటి మ్యాచ్లో హైదరాబాద్ మీదే కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయితే టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం.. ఆ జట్టుకు కొండంత బలంగా నిలిచింది. ఎందుకంటే బౌలింగ్ కు సహకరిస్తున్న మైదానంపై హైదరాబాద్ బౌలర్లు తొలిసారిగా సత్తా చాటారు. ప్రత్యర్థి జట్టును వారి సొంత గడ్డపై ఆల్ అవుట్ చేశారు. భారీగా పరుగులు చేయకుండా ఎక్కడికి అక్కడ కట్టడి చేయగలిగారు. అందువల్లే హైదరాబాద్ చేదించగలిగే లక్ష్యం మాత్రమే నమోదయింది. దానిని ఐదు వికెట్లు నష్టపోయి హైదరాబాద్ సాధించగలిగింది. తద్వారా పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టును వెనక్కి నెట్టి ఎనిమిదవ స్థానంలో నిలిచింది హైదరాబాద్ జట్టు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు అనేక అస్త్ర శస్త్రాలతో రంగంలోకి దిగింది.. ముఖ్యంగా ఆటగాళ్ల విషయంలో టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే ముందుకు పంపించింది. ఇది ఆ జట్టు విజయానికి సానుకూల అంశంగా నిలిచింది.
Also Read : కావ్యమారన్ కు కోపం వస్తే అపరకాళికాదేవి.. వైరల్ వీడియో
ఓపెనర్ ను మార్చాల్సిందే
మరోసారి కూడా ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. ఈసారి 0 పరుగులకే చాప చుట్టాడు. సాధారణంగా అభిషేక్ శర్మ పై అభిమానులకే కాదు హైదరాబాద్ జట్టు యాజమాన్యానికి కూడా భారీ అంచనాలు ఉంటాయి. కానీ వాటిని అతడు అందుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నాడు. మరో ఓపెనర్ హెడ్ కూడా అనవసరమైన బంతులకు టెంప్ట్ అయ్యి వికెట్ పడేసుకుంటున్నాడు. ఇది హైదరాబాద్ జట్టు స్కోర్ మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. అందువల్లే హెడ్, అభిషేక్ శర్మ స్థానంలో అనికేత్ వర్మ, కామిందు మెండిస్ ను పంపిస్తే ఉపయుక్తంగా ఉంటుందని హైదరాబాద్ అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే కామిందు మెండిస్ చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. అనికేత్ వర్మ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. చెత్త షాట్ కు యత్నించి అనవసరంగా అవుట్ అయ్యాడు కాని.. ఒకవేళ అతడు గనుక అలాగే బ్యాటింగ్ ఉంటే మాత్రం హైదరాబాద్ జట్టుకు చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో తిరుగు ఉండేది కాదు. ఇక ఇషాన్ కిషన్ ను వన్ డౌన్ కాకుండా మిడిల్ ఆర్డర్లో పంపిస్తే బాగుంటుంది. క్లాసెన్ ను వన్ డౌన్ ఆటగాడిగా పంపిస్తే బాగుంటుంది.. ఇక హెడ్, అభిషేక్ శర్మ మిడిల్ ఆర్డర్ లో ఉంచితేనే బాగుంటుంది. ఎందుకంటే పంజాబ్ జట్టు మినహా.. మిగతా ఏ జట్లపై కూడా హెడ్, అభిషేక్ చెప్పుకోదగ్గ స్థాయిలో భాగస్వామ్యాలు నిర్మించలేకపోయారు. ఇక ఇటీవల ముంబై మ్యాచ్లో క్లాసెన్ ఎలాంటి విలువైన ఇన్నింగ్స్ ఆడాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు విఫలమయ్యాడు. చెన్నై జట్టపై మాదిరిగానే నితీష్ కుమార్ రెడ్డి ని.. మిగతా మ్యాచ్లకు అదే స్థానంలో బ్యాటింగ్ ఆర్డర్ కు పంపిస్తే హైదరాబాద్ జట్టు ఎక్కువ పరుగులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు తన స్థాయి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. చెన్నై మీద మాత్రం పర్వాలేదు అనిపించాడు. అందుకే జట్టు అవసరాల దృష్ట్యా ఆటగాళ్ళను అటు ఇటు మార్చడం వల్ల ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. బౌలింగ్ విభాగంలో షమీ పూర్తిగా మెరుగుపడాలి.. హర్షల్ పటేల్ , కమిన్స్ కు మరో బౌలర్ గనక తోడైతే హైదరాబాద్ కు తిరుగు ఉండదు. వచ్చే ఐదు మ్యాచ్లు హైదరాబాద్ జట్టుకు అత్యంత కీలకం. ఇందులో ప్రతి మ్యాచ్లో హైదరాబాద్ గెలవాలి. గెలవడం మాత్రమే కాదు భారీ అంతరంతో విజయం సాధించాలి. అప్పుడే హైదరాబాద్ నెట్ రన్ రేట్ మెరుగుపడుతుంది. ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
Also Read : చెన్నైలో సీఎస్కే ఓడింది.. హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది.. వైరల్ వీడియో