https://oktelugu.com/

ఆగిన ఐపీఎల్: పేలిన మీమ్స్.. కామెడీ పీక్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈసారి ఖచ్చితంగా కొడుతామని ఆశపడింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ప్రతిసారి టోర్నీలో ఓడిపోయే ఆ జట్టు ఈ సారి భీకరంగా ఆడి టాప్ లో నిలిచింది. ఇక చెన్నై గత సారి లీగ్ దశలో నిష్క్రమించి ఈసారి టైటిల్ ఫేవర్లలో ఒకరిగా ఉంది. ఢిల్లీ కూడా కప్ గెలుస్తామని కసిగా ఉంది. కానీ ఏం చేద్దాం.. కరోనా ధాటికి ఐపీఎల్ ఆగిపోయింది. దీనిపై దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ముఖ్యంగా గత ఏడు మ్యాచుల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : May 5, 2021 / 05:39 PM IST
    Follow us on

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈసారి ఖచ్చితంగా కొడుతామని ఆశపడింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ప్రతిసారి టోర్నీలో ఓడిపోయే ఆ జట్టు ఈ సారి భీకరంగా ఆడి టాప్ లో నిలిచింది. ఇక చెన్నై గత సారి లీగ్ దశలో నిష్క్రమించి ఈసారి టైటిల్ ఫేవర్లలో ఒకరిగా ఉంది. ఢిల్లీ కూడా కప్ గెలుస్తామని కసిగా ఉంది. కానీ ఏం చేద్దాం.. కరోనా ధాటికి ఐపీఎల్ ఆగిపోయింది. దీనిపై దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.

    ముఖ్యంగా గత ఏడు మ్యాచుల్లో ఆరు ఓడిపోయిన ఐపీఎల్ ఫ్యాన్స్ అయితే సన్ రైజర్స్ టీంకు ఎంత సంతోషమో ఈ పరిణామం అని మీమ్స్, సెటైర్లు తయారు చేసి హోరెత్తిస్తున్నారు. ఇప్పుడవన్నీ నవ్వులు పూయిస్తున్నాయి.

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021ను సస్పెండ్ చేయాలని బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి సంయుక్తంగా నిర్ణయించాయి. బోర్డు ప్రస్తుతం విదేశీ ఆటగాళ్లను ఇంటికి పంపించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మిగతా భారతీయ క్రీడాకారులు అందరూ కూడా వారి కుటుంబాలకు వద్దకు చేరారు. ఐపీఎల్ వాయిదా ఊహించనిది. బయో బబుల్ చాలా బలంగా ఉందని అందరూ భావించారు. కానీ ఆటగాళ్ళు కరోనా బారినపడడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో టోర్నీనే వాయిదావేసేశారు. బయో బబుల్ తో కరోనా కట్టడి కాకపోవడం బీసీసీఐని నివ్వెరపరిచింది. దీంతో బిసిసిఐ అత్యవసరంగా సమావేశమై ఐపీఎల్ 2021 సీజన్‌ను తక్షణమే వాయిదా వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.

    సోషల్ మీడియాలో ఈ ప్రకటన వెలువడిన వెంటనే నెటిజన్లు ఆడేసుకున్నారు. ఆసక్తికరమైన మీమ్స్, ఫొటోలు.. సెటైర్లతో తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రద్దు గురించి సోషల్ మీడియాలో వివిధ భాషలలో వందలాది మీమ్స్ పోటెత్తాయి..

    కొంతమంది ఫ్రాంచైజీల అభిమానులు, మద్దతుదారులు ఐపీఎల్ ఆగిపోయినందుకు సంతోషంగా ఉన్నారు. ఇక కొంతమంది అభిమానులు బీసీసీఐ, తీసుకున్న నిర్ణయంతో అసంతృప్తిగా ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మద్దతు ఇచ్చిన వారికి ఐపీఎల్ వాయిదా ఏమాత్రం రుచించడం లేదు. ప్రతిసారి ఓడిపోయే ఆర్సీబీ ఈసారి దంచికొడుతూ కప్ గెలిచేలా కనిపిస్తోంది. ఇలాంటి వేళ ఐపీఎల్ వాయిదా పడడం వారిని నిరాశకు గురిచేసింది. వరుసగా ఆరు మ్యాచ్ లు ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ టోర్నమెంట్ వాయిదాతో సంతోషంగా ఉన్నారు. ఎగిరిగంతేస్తున్నారు.

    ఈ క్రమంలోనే ఆర్సీబీ ఫ్యాన్స్ బాధపడుతూ మీమ్స్ నవ్వించేలా తయారు చేస్తుండగా.. సన్ రైజర్స్ ఫ్యాన్స్ మాత్రం టోర్నీ వాయిదాతో పండుగ చేసుకుంటున్న మీమ్స్ ను పంచుకున్నారు. ఇవిప్పుడు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో నవ్వులు పంచుతున్నాయి.

    https://twitter.com/YashR066/status/1389499759237365761?s=20