Hasaranga: ఐసీసీ క్వాలిఫైయర్ మ్యాచ్ ల్లో శ్రీలంక స్పిన్నర్ హసరంగా చెలరేగిపోతున్నాడు. ప్రతి మ్యాచ్ లో ఐదు వికెట్లే లక్ష్యంగా రెచ్చిపోతున్నాడు. తాజాగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు హసరంగా. క్వాలిఫైయింగ్ మ్యాచ్ ల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు ఈ శ్రీలంక స్పిన్నర్.
శ్రీలంక జట్టులో అతి కొద్ది కాలంలోనే స్టార్ స్పిన్నర్ గా ఎదిగాడు హసరంగా. శ్రీలంక జట్టు ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు ఆడుతోంది. ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు ఈ శ్రీలంక స్పిన్నర్. ఈ క్రమంలోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు హసరంగా. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. పాకిస్తాన్ బౌలర్ పేరిట ఇప్పటి వరకు ఉన్న రికార్డును సమం చేసి.. ఆ బౌలర్ సరసన చేరాడు హసరంగా.
వరుసగా మూడోసారి ఐదు వికెట్ల ప్రదర్శన..
అక్టోబర్లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ లో ఆడేందుకు ఇప్పటికే పలు జట్లు నేరుగా అర్హత సాధించగా.. మరో పది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి మ్యాచులు ఆడుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం శ్రీలంక ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో స్పిన్నర్ హసరంగా ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. ప్రతి మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న హసరంగా.. ఇలా ఐదు వికెట్లు ప్రదర్శన చేయడం వరుసుగా ఇది మూడోసారి. దీంతో వరుసగా మూడుసార్లు ఐదు వికెట్లు తీసుకొని వన్డేలో పాకిస్తాన్ స్పీడ్ బౌలర్ ఒకరు పేరిట ఉన్న రికార్డును హస్తరంగా సమం చేశాడు. ఇప్పటికే మూడు మ్యాచ్లు ఆడి మొత్తం 16 వికెట్లతో క్వాలిఫైయర్ మ్యాచ్ ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నాడు.
ఫార్మాట్ ఏదైనా అద్భుత ప్రదర్శన..
శ్రీలంక స్పిన్నర్ హసరంగ ఇప్పుడు ఆ జట్టులో కీలకంగా మారాడు. ఫార్మాట్ ఏదైనా జట్టులో తప్పనిసరిగా ఉండే ఆటగాడిగా మారిపోయాడు. బౌలర్ గానే కాకుండా బ్యాట్ తోను జట్టుకు అవసరమైనప్పుడు బారీ పరుగులు చేయగల సామర్థ్యం హసరంగాలో ఉంది. లీగ్ క్రికెట్ లో కూడా అద్భుతమైన ప్రదర్శనతో మెప్పిస్తున్నాడు ఈ శ్రీలంక స్పిన్నర్. ఇక శ్రీలంక జట్టు క్వాలిఫైయర్ మ్యాచ్ ల్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో దాదాపు వరల్డ్ కప్ కు అర్హత సాధించినట్లే కనిపిస్తోంది. మూడు మ్యాచ్ ల్లో 16 వికెట్లు తీయడం ద్వారా శ్రీలంక విజయాల్లో కీలకంగా మారాడు హసరంగా.
ఐర్లాండ్ పై భారీగా పరుగులు..
ఇక ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు భారీగా పరుగులు చేసింది. ఓపెనర్ కరుణ రత్న సెంచరీ (103) తో చెలరేగగా, సమర విక్రమ (82) అర్థ సెంచరీ తో రాణించాడు. చివర్లో ధనుంజయ డిసిల్వా (42) మెరుపులు మెరిపించడంతో శ్రీలంక జట్టు 325 పరుగులు చేసింది. ఇక లక్ష్య చేధనలో ఐర్లాండ్ జట్టు 192 పరుగులకే ఆల్ అవుట్ అయింది. జట్టులో ఒక్క ఆటగాడు కూడా అర్థ సెంచరీ కూడా చేయలేకపోయాడు. 39 పరుగులు చేసిన క్యాంపర్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో ఐదు వికెట్లతో అదరగొట్టిన హసరంగ ఐర్లాండ్ జట్టు వెన్నుముక విరిచి శ్రీలంక జట్టు ఘన విజయం సాధించడంలో కీలకంగా మారాడు.