ENG vs SL : ఎట్టకేలకు ఇంగ్లాండ్ జట్టుపై శ్రీలంక విజయాన్ని సాధించింది. మూడు టెస్టుల సిరీస్ లో రెండు టెస్టులు కోల్పోయిన శ్రీలంక.. చివరిదైన మూడు టెస్టులో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపును దక్కించుకుంది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక 124 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా శ్రీలంక జట్టు దర్జాగా విజయాన్ని అందుకుంది. చివరి టెస్టులో ఓటమిపాలైనప్పటికీ, తొలి రెండు టెస్టులలో ఇంగ్లాండ్ 2-1 తేడాతో విజయం సాధించడంతో.. సిరీస్ సొంతమైంది. ఓవల్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ నాలుగు రోజులపాటు సాగింది. ఇంగ్లాండ్ విధించిన 219 పరుగుల విజయ లక్ష్యం తో శ్రీలంక జట్టు బరిలోకి దిగింది. 40.3 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి.. టార్గెట్ రీచ్ అయింది. మరో ఓపెనర్ కరుణ రత్నే(8) దారుణంగా విఫలమైనప్పటికీ.. కుశాల్ మెండిస్ (39) మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో మ్యాథ్యూస్ 32* తన వంతు పాత్ర పోషించడంతో నిస్సాంక తదుపరి ఘట్టాన్ని పూర్తి చేశాడు..
ఈ మ్యాచ్లో ముందుగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 325 రన్స్ కు ఆల్ అవుట్ అయింది.. కెప్టెన్ ఓలీ పోప్ 1504 పరుగులు చేశాడు. బెన్ డకెట్ 86 రన్స్ చేశాడు. శ్రీలంక బౌలర్లలో రత్న నాయకే మూడు వికెట్లు దక్కించుకున్నాడు. విశ్వ, కుమార, ధనుంజయ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అసిత ఒక వికెట్ సొంతం చేసుకున్నాడు.
ఆ తర్వాత శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆల్ అవుట్ అయింది. నిస్సాంక 64, ధనుంజయ, కామిందు అర్థ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో హుల్, ఓల్లీ స్టోన్ చలో మూడు వికెట్లు దక్కించుకున్నారు. వోక్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. షోయబ్ బషీర్ ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్ లో 58 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించడంతో.. రెట్టించిన ఉత్సాహంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండు టాప్ ఆర్డర్ అనూహ్యంగా కూలిపోయింది. 156 పరుగులకే ఆ జట్టు ఆల్ అవుట్ అయింది. శ్రీలంక బౌలర్లలో కుమార 4 వికెట్లు పడగొట్టాడు. విశ్వ మూడో వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో స్మిత్ చేసిన 67 పరుగులే హైయెస్ట్ స్కోర్. దీంతో శ్రీలంక ఎదుట ఇంగ్లాండ్ 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది.
గత రెండు టెస్టుల ప్రకారం చూసుకుంటే.. ఈ లక్ష్యం అత్యంత కఠినమైనదని ఇంగ్లాండ్ అభిమానులు అనుకున్నారు. కచ్చితంగా తమ జట్టు గెలుస్తుందని భావించారు. కానీ నిస్సాంక గట్టిగా నిలబడ్డాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. టెస్టులో టి20 తరహా బ్యాటింగ్ చేశాడు. తన జట్టును వైట్ వాష్ ప్రమాదం నుంచి తప్పించాడు. ఇక రెండవ ఇనింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్లు వోక్స్, అట్కిన్సన్ చెరో వికెట్ సొంతం చేసుకున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More