SRH VS MI : కానీ ప్రస్తుతం ముంబై జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లకు నీరసం వచ్చినట్టుంది. ఏదో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నట్టు.. 50 ఓవర్ల ఫార్మాట్ లో బ్యాటింగ్ చేస్తున్నట్టు ఆడారు. ఫలితంగా రాకెట్ వేగంతో పరుగులు తీయాల్సిన చోట.. నిస్తేజంగా.. నీరసంగా బ్యాటింగ్ చేశారు.. ఓపెనర్లలో అభిషేక్ శర్మ(40) ఉన్నంత సేపు దూకుడు కొనసాగించగా.., హెడ్(28) మాత్రం తన సహజ శైలికి భిన్నంగా ఆడాడు. వచ్చిన జీవధానాన్ని ఉపయోగించుకోకుండా.. ఏదో అర్జెంటు పని ఉందన్నట్టు హెడ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ అవుట్ కాగానే వచ్చిన ఇశాన్ కిషన్ (2), నితీష్ కుమార్ రెడ్డి (19) విఫలమయ్యారు.. తొలి మ్యాచ్లో సెంచరీ చేసిన ఇషాన్ ఇంతవరకు డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయాడు.. ఇక నితీష్ కుమార్ రెడ్డి తన విఫల ప్రదర్శన కొనసాగిస్తూనే ఉన్నాడు.. తెలుగోడు అని తెలుగు అభిమానులు నెత్తికెక్కించుకుంటే.. అతడు మాత్రం నేలబారు ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. ఇక క్లాసెన్(37) దూకుడుగా ఆడే క్రమంలో అవుటయ్యాడు.. ఇక చివర్లో అనికేత్ వర్మ(18*) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ముంబై జట్టులో విల్ జాక్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్థిక్ పాండ్యా, బుమ్రా, బౌల్ట్ తలా ఒక వికెట్ సాధించారు.
Also Read : 18 వ వడి లో హిట్ మ్యాన్ .. బీసీసీఐ సర్ ప్రైజ్
కాటేరమ్మ కొడుకులకు ఏమైంది
పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వీర విహారం చేసిన హైదరాబాద్ ఆటగాళ్లు.. ముంబై తో జరుగుతున్న మ్యాచ్లో మాత్రం విఫలమయ్యారు. హైదరాబాద్ ఇన్నింగ్స్ లో అభిషేక్ శర్మ చేసిన 40 పరుగులే టాప్ స్కోర్ అంటే.. బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి అత్యంత చెత్త ఆట తీరు ప్రదర్శించాడు. ఇక ఇషాన్ కిషన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వీరిద్దరూ ముంబై బౌలర్ల ముందు దాసోహం అయ్యారు. నితీష్ కుమార్ రెడ్డి చేసింది 21 బంతుల్లో 19 పరుగులు.. ఇందులో ఒక ఫోర్ మాత్రమే ఉంది. వాస్తవానికి నితీష్ కుమార్ రెడ్డి పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ వాటిని అదుకోవడంలో అతడు వరుసగా విఫలమవుతున్నాడు. ఇంత దారుణంగా ఆడుతున్న ఆటగాడికి హైదరాబాద్ యాజమాన్యం ఎందుకు అవకాశం ఇస్తుందో అంతు పట్టడం లేదు. చివర్లో వచ్చిన అనికేత్ వర్మ 19 ఓవర్లో 15 పరుగులు చేశాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు స్కోర్ దూసుకుపోయింది. కనీసం ఆమాత్రం చొరవ కూడా నితీష్ కుమార్ రెడ్డి చూపించలేకపోయాడు. నితీష్ ఆడిన ఆట హైదరాబాద్ యాజమాన్యానికే కాదు.. మైదానంలో ఉండి మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఇబ్బంది కలిగించింది. అయితే ఇప్పటికే ఈ మైదానంపై అత్యంత చెత్త రికార్డు కలిగి ఉన్న హైదరాబాద్ జట్టు.. ముంబై జట్టును ఏ విధంగా నిలువరిస్తుందో చూడాల్సి ఉంది.