SRH Vs GT IPL 2025: చెన్నై జట్టు మీద విజయం సాధించిన తర్వాత హైదరాబాద్ మేనేజ్మెంట్ ఆటగాళ్లకు కాస్త ఆటవిడుపుగా ఉంటుందని భావించి.. ప్రత్యేకంగా విమానాలు బుక్ చేసి మాల్దీవులు తీసుకెళ్లింది. ఆటగాళ్లు ప్రశాంతంగా ఉండాలని.. ఒత్తిడిని దూరం పెట్టి ఆట మీద మాత్రమే మనసు లగ్నం చేసే విధంగా రీ క్రియేషన్ చేసింది. కానీ వారు మాత్రం మాల్దీవుల పర్యటనను వెకేషన్ గా మాత్రమే ఉపయోగించుకున్నారు. తమ ఆట తీరులో మార్పు చూపించక పోగా.. గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ ముందు తలవంచి పరువు తీసుకున్నారు. మొత్తంగా ప్లే ఆఫ్ అవకాశాలను అత్యంత సంక్లిష్టం చేసుకున్నారు.. డబ్బులు బాగా ఖర్చు పెట్టి.. నాన్ కోచింగ్ స్టాఫ్.. కోచింగ్ స్టాఫ్ ను సమకూర్చి.. అభిమానులతో గెట్ టుగెదర్ వంటి వేడుకలు నిర్వహించి.. మాల్దీవుల వంటి ప్రాంతానికి తీసుకెళ్లినప్పటికీ హైదరాబాద్ ఆటగాళ్ల ఆటతీరులో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా ఎదురుదాడికి దిగి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాల్సిన తరుణంలో.. హైదరాబాద్ ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ మినహా మిగతా వారంతా గుజరాత్ బౌలర్లకు దాసోహం అయ్యారు. ఫలితంగా హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. ఈ సీజన్లో గుజరాత్ జట్టుతో తలపడిన రెండో మ్యాచ్లో కూడా ఓడిపోయింది. సొంత మైదానంలో గుజరాత్ జట్టును అడ్డుకోలేకపోయింది. గుజరాత్ లోనూ ప్రతిఘటించలేకపోయింది.
Also Read: గుజరాత్ చేతిలో ఓడినా..హైదారాబాద్ కు ప్లే ఆఫ్ అవకాశాలు.. ఎలాగంటే..
డబ్బులు బొక్క
ఆటగాళ్లకు ఆట విడుపుగా ఉంటుందని ఇటీవల హైదరాబాద్ మేనేజ్మెంట్ మాల్దీవులకు తీసుకెళ్లింది. రెండు విడతలుగా ఆటగాళ్లను తీసుకెళ్లి వారికి కావలసినవన్ని సమకూర్చింది. తినేంత తిండి.. తాగేంత తాగుడు అందించింది. మేనేజ్మెంట్ ఇన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ.. ఆ స్థాయిలో ఆనందాన్ని అందించినప్పటికీ.. హైదరాబాద్ ఆటగాళ్లు మైదానంలో విఫలమయ్యారు. జట్టు మేనేజ్మెంట్ పై ఏమాత్రం గౌరవం చూపించకుండా.. గట్టు మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు. గొప్పగా ఆడతారు.. ప్లే ఆఫ్ వెళ్తారు అని మేనేజ్మెంట్ భావిస్తే.. వారి అంచనాలను మొత్తం తలకిందులు చేశారు.. అహ్మదాబాద్ మైదానంలో టాస్ గెలిచినప్పటికీ బౌలింగ్ ఎంచుకొని.. హైదరాబాద్ కెప్టెన్ మొదటి తప్పు చేస్తే.. చెత్త ఫీల్డింగ్.. దిక్కుమాలిన బౌలింగ్.. నాసిరకమైన బ్యాటింగ్ తో తప్పుల మీద తప్పులు చేసింది. మొత్తంగా ఓడిపోయి తలవంచుకుంది. గత సీజన్లో హైదరాబాద్ ఫైనల్ దాకా వెళ్ళగా.. ఈసారి మాత్రం గ్రూప్ దశ నుంచే ఇంటికి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ” హైదరాబాద్ మేనేజ్మెంట్ ఉదారంగా వ్యవహరించింది. ఆటగాళ్ల కోసం ఏదో చేయాలని తపించింది. కానీ ఆటగాళ్ల ఆలోచన మరో విధంగా ఉంది. జట్టు కోసం కాకుండా.. ఏదో కొనుక్కున్నారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాం అన్నట్టుగా వారి ఆట తీరు సాగుతోంది. ఇలా ఉన్నప్పుడు జట్టు ఎలా గెలుస్తుంది.. విజయాలు సాధించి ట్రోఫీ ఎలా దక్కించుకుంటుంది. మొత్తంగా చూస్తే హైదరాబాద్ జట్టు ఈసారి అత్యంత దారుణమైన ఆట తీరు ప్రదర్శించడం ఇబ్బందికరంగా ఉందని” సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు.
Also Read: గుజరాత్ టైటాన్స్ సంచలనం.. ఐపీఎల్ లో సరికొత్త రికార్డు