https://oktelugu.com/

SRH Vs DC: స్టార్క్ దెబ్బకు చూస్తుండగానే నాలుగు..సన్ రైజర్స్ కు ఏమైంది?

SRH Vs DC ఉగాది.. తెలుగు వాళ్లకు తొలి సంవత్సరాది. ఈ పండుగ రోజున తెలుగు వాళ్ళ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్(IPL) మ్యాచ్ ఆడుతోంది.

Written By: , Updated On : March 30, 2025 / 04:18 PM IST
SRH Vs DC

SRH Vs DC

Follow us on

SRH Vs DC: విశాఖ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ, సన్ రైజర్స్ హైదరాబాద్(SRH vs DC) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే అతడి నిర్ణయం తప్పని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ఢిల్లీ బౌలర్లు స్టార్క్, ముఖేష్ కుమార్ పరుగులు ఇస్తున్నప్పటికీ.. హైదరాబాద్ బ్యాటర్లను బోల్తా కొట్టించారు. ఇటీవల లక్నో జట్టుతో ఎదురైన ఓటమి నేపథ్యంలో.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని హైదరాబాద్ జట్టు గట్టి ప్రణాళికలతో రంగంలోకి దిగింది. కానీ ప్రారంభంలోనే హైదరాబాద్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై వీర విహారం చేసిన అభిషేక్ శర్మ.. ఈ మ్యాచ్లో కూడా విఫలమయ్యాడు. ఒక పరుగు మాత్రమే చేసి విప్రవ్ నిగం చేతిలో రన్ అవుట్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు మొదటి ఓవర్ 5 బంతికి తొలి వికెట్ కోల్పోయింది. అప్పటికి హైదరాబాద్ జట్టు స్కోర్ 11 పరుగులు మాత్రమే. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత వన్ డౌన్ ఆటగాడిగా వచ్చిన ఇషాన్ కిషన్ మరోసారి తేలిపోయాడు. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 0 పరుగులకు అవుట్ అయిన అతడు.. ఈ మ్యాచ్లో స్టార్క్ బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా బౌండరీ లైన్ వద్ద స్టబ్స్ కు చిక్కాడు..ఇషాన్ కిషన్ కేవలంరెండు పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ దశలో వచ్చిన తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి(0) స్టార్క్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఫలితంగా ఆ బంతి గాల్లో ఇవ్వడంతో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఏమాత్రం పొరపాటుకు తావు ఇవ్వకుండా అందుకున్నాడు. దీంతో హైదరాబాద్ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. అప్పటికి హైదరాబాద్ స్కోర్ 25 పరుగులు మాత్రమే..

హెడ్ కూడా..

అభిషేక్ శర్మ (5), ఇషాన్ కిషన్(2), నితీష్ కుమార్ రెడ్డి (0) వెంట వెంటనే అవుట్ కావడంతో హైదరాబాద్ జట్టు భారం మొత్తం హెడ్ మీద పడింది. హెడ్ (22) కూడా తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తుండగా.. స్టార్క్ విసిరిన బంతి అతడిని పెవిలియన్ పంపించింది. స్టార్క్ బౌలింగ్లో బంతి బెడ్ బ్యాట్ అంచుకు తగులుతూ కీపర్ రాహుల్ చేతిలో పడింది. దీంతో హైదరాబాద్ జట్టు కు ఒక్కసారిగా షాక్ తగిలింది.. మైదానంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు దిగ్బ్రాంతికి గురయ్యారు. స్టార్క్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టడంతో.. హైదరాబాద్ జట్టు కోలుకోకుండా అయింది. ప్రస్తుతం ఈ కథనం రాసే సమయానికి హైదరాబాద్ జట్టు 4.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో అనికేత్ వర్మ(6*), క్లాసెన్(11*) ఉన్నారు.