SRH: హైదరాబాద్ జట్టు తన తదుపరి మ్యాచ్ మే 2 న రెండున గుజరాత్ టైటాన్స్ తో ఆడుతుంది. దీనికి సంబంధించి ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టకుండా.. ఉన్నట్టుండి ఒక్కసారిగా మాల్దీవులకు వెళ్లిపోయారు. దీంతో స్పోర్ట్స్ వర్గాల్లో రకరకాల ప్రచారాల మొదలయ్యాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత తలమునకయ్యే ప్రాక్టీస్ లో ఆటగాళ్లు నిమగ్నమవుతారు. మధ్యాహ్నం భోజనం.. రాత్రిపూట డిన్నర్ మినహా.. మిగతా సమయం మొత్తం మైదానంలోనే గడుపుతారు. మరోవైపు ఈ సీజన్లో ఇప్పటివరకు టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్ జట్టుతో హైదరాబాద్ తలపడుతోంది కాబట్టి.. తీవ్రమైన కసరత్తు అవసరం. కానీ అలాంటిది ఏమీ చేయకుండానే హైదరాబాద్ జట్టు నిశ్శబ్దంగా ఉండి పోవడం.. ఉన్నట్టుండి మాల్దీవులకు వెళ్లిపోవడం సంచలనం కలిగిస్తోంది.. నిజంగా ఆటగాళ్లు మాల్దీవులకు ఎందుకు వెళ్లారు? దానికి సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఎందుకు ఆమోదముద్ర వేసింది? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.
Also Read: 9 మ్యాచ్ లలో 19 మందిని ఆడించాం.. ఇంకేం చేస్తాం?: ధోని నిస్సహాయత!
ఇంతకీ ఎందుకు వెళ్ళినట్టు
2013లో సన్ గ్రూప్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జట్టు ఏర్పడింది.. అయితే ఇప్పటివరకు కూడా ఎన్నడూ హైదరాబాద్ వెకేషన్ వెళ్లిన దాఖలాలు లేవు.. కానీ ఈసారి మాత్రం హైదరాబాద్ ఆటగాళ్లు వెకేషన్ వెళ్ళిపోయారు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ లలో హైదరాబాద్ జట్టు మూడిట్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. గత సీజన్లో హైదరాబాద్ జట్టు ఫైనల్ లాగా వెళ్ళింది. హైదరాబాద్ ఈ సీజన్లో ప్లే ఆఫ్ వెళ్ళాలంటే.. తదుపరి ఐదు మ్యాచ్లలో భారీ తేడాతో విజయం సాధించాలి.. ఇవన్నీ కఠిన సవాళ్లు కావడంతోనే ఆటగాళ్లకు కాస్త ఆటవిడుపు కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం వెకేషన్ తీసుకెళ్లింది. వారందరూ ఊహించని విధంగా మాల్దీవులకు పంపించింది…” ఇటీవల కాలంలో హైదరాబాద్ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గెలిచిన తర్వాత.. ముంబై చేతిలో ఓడిపోయారు. మళ్లీ చెన్నై చేతిలో గెలిచారు. ఇప్పుడిక గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తో హైదరాబాద్ జట్టు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇందులో బెంగళూరు తో ఈ సీజన్లో తలపడటం హైదరాబాద్ జట్టుకు ఇదే తొలిసారి. లక్నో, గుజరాత్, ఢిల్లీ, కోల్ కతా జట్లతో జరిగిన మ్యాచ్లలో హైదరాబాద్ ఓడిపోయింది. ఒకరకంగా ఈ నాలుగు జట్లు కూడా హైదరాబాద్ కంటే బలంగా ఉన్నాయి. పాయింట్లు పట్టికలోనూ పై స్థానాలలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు మానసికంగా ఉత్సాహాన్ని సాధించడానికి.. శారీరకంగా సామర్థ్యాన్ని పొందడానికి వెకేషన్ తోడ్పడుతుందని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్య భావించి.. ఆటగాళ్లను, సపోర్టింగ్ స్టాఫ్ ను ప్రత్యేక విమానంలో మాల్దీవులు తీసుకెళ్లింది. అక్కడ ఒకటి లేదా రెండు రోజులు ఉన్న తర్వాత.. మళ్లీ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి వస్తారు.. మే రెండవ తేదీన గుజరాత్ జట్టుతో జరిగే మ్యాచ్లో తలపడతారు. మొత్తంగా బంధువుల వెకేషన్ తమ జట్టు రాత మార్చుతుందని హైదరాబాద్ యాజమాన్యం భావిస్తోంది.
Also Read: వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా..కోల్ కతా పై పంజాబ్ సరికొత్త రికార్డు
Team SRH in Maldives for a mini vacation. pic.twitter.com/UJeOdf7rus
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 27, 2025