SRH: వెనుకటి కాలంలో బహుళ ప్రజాదరణ పొందిన ఓ సినిమా కథ అది. అలానే ఇప్పుడు హైదరాబాద్ జట్టు అసలు గుట్టు కూడా ప్రత్యర్థి జట్లకు తెలిసిపోయింది. అందువల్లే వరుసగా ఓడిస్తున్నాయి.. కాటేరమ్మ కొడుకులు.. 300 పరుగులు చేస్తారు.. దుమ్ము రేపు తారనే అంచనాలను ప్రత్యర్థి జట్లు తలకిందులు చేస్తున్నాయి. హైదరాబాద్ ప్రధాన బలమైన బ్యాటింగ్ ను దెబ్బతీస్తున్నాయి.. అందువల్లే హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. చివరికి సొంత మైదానంలో మాత్రమే గెలుస్తుందనే అపప్రదను మూట కట్టుకున్నది. ఇక గురువారం ముంబై తో జరిగిన మ్యాచ్లో అత్యంత చెత్త ప్రదర్శన చేసి.. దారుణమైన ఓటమిని మూటగట్టుకుని.. హైదరాబాద్ జట్టు పరువు తీసుకుంది.
Also Read: గ్రేట్ అభిషేక్.. ఆట తీరుతోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ మనసులు గెలిచావ్.. వైరల్ ఫోటో
అందువల్లే ఓడిపోతోందా
ప్రారంభ మ్యాచ్లో రాజస్థాన్ జట్టుపై భారీ స్కోరు చేసిన హైదరాబాద్.. ఒక్కసారిగా తనపై అంచనాలను పెంచేసుకుంది. ఈసారి ఎలాగైనా 300 పరుగులు చేస్తుందనే హైప్ ను తెచ్చుకుంది. కానీ వాస్తవంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.. సొంత మైదానంలో మినహా.. మిగతా అన్నిచోట్ల హైదరాబాద్ జట్టు విఫలమవుతూనే ఉంది.. విశాఖపట్నం, కోల్ కతా, ముంబై వంటి మైదానాలలో ఆడి ప్రత్యర్థుల ఎదుట తలవంచింది.. ఉప్పల్ మైదానంలో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేయడానికి గమనించిన ప్రత్యర్థి జట్లు స్లో పిచ్ లు తయారుచేస్తున్నాయి. అయితే ఈ పిచ్ లపై ఆడేందుకు హైదరాబాద్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో మరోసారి ఇదే నిరూపితమైంది. ఈ ఒక్క ఆటగాడు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. అభిషేక్ శర్మ మినహాయిస్తే మిగతా ఆటగాళ్లు మొత్తం విఫలమయ్యారు. హెడ్ తన దూకుడును పక్కనపెట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి టెస్ట్ తరహా బ్యాటింగ్ చేశాడు. ఇషాన్ కిషన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.. చివర్లో వచ్చిన అనికేత్ మెరుపులు మెరిపించాడు. లేకపోతే హైదరాబాద్ జట్టు స్కోరు మరింత దారుణంగా ఉండేది. అయితే సొంత మైదానంలో బీభత్సంగా ఆడుతున్న హైదరాబాద్ ఆటగాళ్లు.. పరాయి మైదానాలపై మాత్రం తేలిపోతున్నారు..స్లో పిచ్ లపై దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ ఆటగాళ్ల బలహీనతను గమనించిన ప్రత్యర్థి జట్టు కెప్టెన్లు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ జట్టును తక్కువ స్కోరుకు పరిమితం చేసి.. ఆ తర్వాత వారు చేజింగ్ మొదలు పెడుతున్నారు. గురువారం జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇదే చేశాడు. అయితే కేవలం సొంతమైదానం మాత్రమే విపరీతమైన పట్టును కలిగి ఉన్న హైదరాబాద్ ఆటగాళ్లు స్లో పిచ్ లపై తేలిపోవడం..సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. “మరి ఈ లోపాన్ని హైదరాబాద్ ఆటగాళ్లు ఎప్పుడు సవరించుకుంటారు? తదుపరి మ్యాచ్లలో ఎలా ఆడతారు? ప్లే ఆఫ్ చేరుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ” అని హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
Also Read: రోహిత్ శర్మ..ఓవర్ నైట్ కెప్టెన్ కాదు.. దాని వెనుక జీవితానికి మించిన కష్టం.. గూస్ బంప్స్ వీడియో ఇది