Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024 కోసం ఇప్పటి నుంచే విపరీతమైన కసరత్తు లను చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మొన్న జరిగిన మినీ వేలం లో అన్ని టీమ్ లు వాళ్ళకి కావాల్సిన ప్లేయర్లని కొనుగోలు చేశారు. ఇక అందులో భాగంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అయితే ఏకంగా ముగ్గురు ఫారన్ ప్లేయర్స్ ని కొనుగోలు చేసింది. ముఖ్యంగా పాట్ కమ్మిన్స్ కోసం 20.50 కోట్ల డబ్బులను కేటాయించడం అనేది కొంతవరకు హైదరాబాద్ అభిమానులను తీవ్రం గా నిరాశ పరిచినప్పటికి కమ్మిన్స్ లాంటి ఒక మంచి ప్లేయర్ టీమ్ లోకి వస్తే టీమ్ స్ట్రాంగ్ అవుతుంది అనే కాన్ఫిడెంట్ తోనే హైదరాబాద్ టీమ్ కమ్మిన్స్ కోసం అన్ని డబ్బులు పెట్టినట్టుగా తెలుస్తుంది.
అయితే ఇప్పుడు సన్ రైజర్స్ టీం లో కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తారు అనే దానిపైన తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఐడెన్ మార్కరం కెప్టెన్సీలో ఆడిన సన్ రైజర్స్ టీం పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. దాంతో సన్ రైజర్స్ టీం అతనికి ఆల్టర్నేట్ గా మరో కెప్టెన్ ని నియమించాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మొన్న జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా టీం కి కెప్టెన్ గా ఉంటూ ఆ టీమ్ కి వరల్డ్ కప్ అందించిన కమ్మిన్స్ ని కొనుగోలు చేయడానికి గల కారణం కూడా ఏంటంటే అతన్ని కెప్టెన్ గా చేయాలనే ఉద్దేశంతోనే సన్ రైజర్స్ టీం అన్ని డబ్బులు పెట్టి ఆయన్ని తీసుకున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో కమ్మిన్స్ ని కెప్టెన్ గా చేస్తూ ఎవరు ఆడితే టీం స్ట్రాంగ్ గా ఉంటుంది అనే దాని పైన కూడా పలు రకాల చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే హైదరాబాద్ టీం ప్లేయింగ్ 11 లో ఎవరెవరు ఆడితే టీమ్ స్ట్రాంగ్ అవుతుందో మనం ఒకసారి తెలుసుకుందాం…
ముందుగా ఓపెనర్ గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఉంటే పవర్ ప్లే లో కొన్ని ఎక్కువ రన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రావిస్ హెడ్ చాలా మంచి హిట్టర్ కాబట్టి పవర్ ప్లే లో తనదైన దూకుడుతో ఆడి టీం కి భారీ స్కోర్ చేస్తాడు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక నెంబర్ త్రీ లో రాహుల్ త్రిపాఠి ఆడితే బాగుంటుంది. ఎందుకంటే రాహుల్ త్రిపాఠి కూడా మ్యాచ్ పొజిషన్ ని బట్టి గేమ్ ఆడతాడు కాబట్టి ఆయన నెంబర్ 3 లో ఆడటం మంచింది. ఇక నెంబర్ 4 లో ఐడేన్ మార్కరం ఆడితే టీం మిడిల్ ఆర్డర్ లో చాలా స్ట్రాంగ్ గా పర్ఫాం చేస్తుంది… ఇక నెంబర్ 5 లో హెన్రీచ్ క్లాసెన్ ని తీసుకుంటే వికెట్ కీపింగ్ తో పాటు ఇటు బ్యాటింగ్ లో కూడా తన సత్తా చూపించగల కెపాసిటీ ఉన్న ప్లేయర్ కాబట్టి ఆయన ఉండడం ఉత్తమం…
ఇక నెంబర్ 6 లో అబ్దుల్ సమాద్ అయితే అటు హిట్టింగ్ చేయగలడు కాబట్టి చివర్లో హిట్లర్ గా బాగా పనికి వస్తాడు కాబట్టి ఆయన ఉంటే టీం కి బాగా హెల్ప్ అవుతుంది.నెంబర్ 7 లో శబ్యాజ్ అహ్మద్ అయితే బాగుంటుంది. ఇక నెంబర్ 8 లో పాట్ కమ్మిన్స్ వస్తే అటు బ్యాటింగ్ లోను, ఇటు బౌలింగ్ లోను రెండింటికి కూడా ఆయన సమపాలలో న్యాయం చేయగలడు అలాగే కెప్టెన్సీ బాధ్యతల్ని తనకి అప్పగించిన కూడా చాలా సక్సెస్ ఫుల్ గా టీం ని ముందుకు తీసుకెళ్లగలడనే కాన్ఫిడెంట్ అయితే అందరికీ ఉంది.
ఇక నెంబర్ 9 లో భువనేశ్వర్ కుమార్ ఆడితే బాగుంటుంది. భువి బాల్ తో పాటు బ్యాటింగ్ లోని తన శక్తి మేరకు ప్రయత్నం అయితే చేయగలడు. ఇక నెంబర్ 10 లో మయాంక్ మార్కండే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. నెంబర్ 11 లో నటరాజ్ తనదైన సత్త చాటుతాడు అనటం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…