SRH lady fan warning MI RCB: ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దూకుడు కొనసాగిస్తోంది. ఈసారి ఐపీఎల్ ప్రారంభంలో తొలి మ్యాచ్ హైదరాబాద్ జట్టు బెంగళూరు తో తలపడింది. ఆ మ్యాచ్ లో 200 కు స్కోర్ చేసినప్పటికీ గెలవలేకపోయింది. ఆ తదుపరి మ్యాచ్ గెలిచింది.. అనంతరం మరో మ్యాచ్ ఓడిపోయింది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు వాడిన హైదరాబాద్ జట్టు నాలుగు విజయాలు నమోదు చేసింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో ఏకంగా మూడవ స్థానంలో కొనసాగుతోంది.
హైదరాబాద్ జట్టు సొంత గడ్డమీద విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అభిమానుల ఆశలు అమాంతం పెరిగాయి. ఈసారి ఎలాగైనా తమ జట్టు ట్రోఫీ గెలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ జట్టు మీద ఉన్న అభిమానాన్ని రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు మీద అభిమానాన్ని ప్రదర్శించే వారి జాబితాలో పురుషులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు ఈ జాబితాలో అమ్మాయిలు కూడా చేరిపోయారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్ జట్టు మ్యాచ్ ఆడుతోందంటే చాలు అమ్మాయిలు ఉప్పల్ మైదానానికి క్యూలు కడుతున్నారు.. హైదరాబాద్ జట్టుకు పెద్ద సపోర్ట్ అందిస్తున్నారు. కమాన్ ఆరెంజ్ ఆర్మీ అంటూ నినాదాలు చేస్తున్నారు. హైదరాబాద్ జట్టు జెర్సీ వేసుకుని మైదానంలో సందడి చేస్తున్నారు. అయితే హైదరాబాద్ జట్టు అభిమానుల అంచనాలను గత మూడు మ్యాచ్ల్లో అందుకుంది. బ్యాటింగ్లో అదరగొట్టింది. బౌలింగ్లో సత్తా చూపించింది.
తాజాగా ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం ద్వారా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.. అంతేకాదు అభిమానుల ప్రేమను మరింత గొప్పగా పొందింది. ఈ నేపథ్యంలో ఓ లేడీ ఫ్యాన్ ఆరెంజ్ ఆర్మీ మీద ప్రశంసలు కురిపించింది. ఈసారి బెంగళూరు, ముంబై ఇండియన్స్ ఇంకా అలాంటి జట్లు ఎన్ని వచ్చిన సరే ఆరెంజ్ ఆర్మీ వెనక్కి తగ్గదని.. కచ్చితంగా ఐపీఎల్ ట్రోఫీ సాధిస్తుందని స్పష్టం చేసింది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి.
IPLలో SRH ఫామ్ చూస్తుంటే ఈసారి కప్పు మనదేనన్న ధీమా అభిమానుల్లో కనిపిస్తోంది. తాజాగా ఓ లేడీ ఫ్యాన్ నిన్నటి మ్యాచ్ గెలుపు తర్వాత ఇతర జట్లకు వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరలవుతోంది. “ఈసారి SRHదే కప్పు. MI, RCB.. ఎవరు వస్తారో రండి.. చూసుకుందాం. మాదే కప్పు. 2016 రిపీటవుతుంది. తగ్గేదేలే”… pic.twitter.com/WiLWzQsMhE
— ChotaNews App (@ChotaNewsApp) April 22, 2026