Homeక్రీడలుSakib Hussain SRH: నిండా 22 ఏళ్ళు లేవు.. ఐపీఎల్ లో ఒక్క సిక్సర్ ఇవ్వలేదు.....

Sakib Hussain SRH: నిండా 22 ఏళ్ళు లేవు.. ఐపీఎల్ లో ఒక్క సిక్సర్ ఇవ్వలేదు.. SRH నిప్పు కణిక ఇతడు

Sakib Hussain SRH: పేద కుటుంబం.. కనీసం క్రికెట్ బ్యాట్ కొనేందుకు డబ్బులు కూడా లేవు. వైట్ కార్క్ బంతి కొనాలంటే స్తోమత సరిపోలేదు.. అటువంటి కుటుంబం నుంచి వచ్చాడు. పైగా తనది బీహార్.. అత్యంత పేదరికం.. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తేనే కుటుంబం గడిచేది. అటువంటి స్థితిలో అతడు క్రికెట్ మీద మక్కువ పెంచుకున్నాడు. కాకపోతే టెన్నిస్ బంతితో ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడు. అది అతడిని ఈ స్థాయి దాక తీసుకొచ్చింది. అతడు మరెవరో కాదు షాకీబ్ హుస్సేన్.

ఇటీవల రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. తద్వారా హైదరాబాద్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. కెప్టెన్ కిషన్ అందించిన ప్రోత్సాహాన్ని అంది పుచ్చుకొని.. అద్భుతంగా బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు. 21 సంవత్సరాల వయసులోనే బంతిమీద అద్భుతమైన గ్రిప్ సంపాదించాడు. అందువల్లే అత్యంత పదునైన బంతులు వేయగలుగుతున్నాడు.. రాజస్థాన్, చెన్నై, తాజాగా ఢిల్లీ ఈ మూడు జట్లమీద నిప్పు కణికల మాదిరిగా బంతులు వేసి సత్తా చూపించాడు.. అందువల్లే కెప్టెన్ కిషన్ అతడిని సంపూర్ణంగా నమ్ముతున్నాడు.

ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు అద్భుతంగా బౌలింగ్ వేశాడు. దీంతో మరోసారి అతడిని కిషన్ ఎందుకు అంతలా నమ్ముతున్నాడో అందరికీ అర్థమైంది. ఒక రకంగా హైదరాబాద్ జట్టుకు హుస్సేన్ వరం లాగా మారాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్లలో 72 బంతులు వేశాడు హుస్సేన్. ఒక్క సిక్సర్ కూడా ఇవ్వలేదు. ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వాస్తవానికి ఐపిఎల్ అంటేనే పరుగుల ప్రవాహం సాగుతూ ఉంటుంది. అంతటి బుమ్రా కూడా పరుగులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అటువంటి ఐపిఎల్ లో హుస్సేన్ ఇంతవరకు ఏ ఆటగాడికి కూడా సిక్సర్ కొట్టే అవకాశం ఇవ్వలేదు..

హుస్సేన్ వేగంతో పాటు.. వేరియేషన్ చూపిస్తున్నాడు. బంతి వేసే విధానంలో అద్భుతమైన లయను ప్రదర్శిస్తున్నాడు. ముఖ్యంగా పిచ్ కండిషన్ అర్థం చేసుకొని, బంతిని తనదైన శైలిలో విసురుతున్నాడు. దీనివల్ల బ్యాటర్ పరుగులు తీయడంలో ఇబ్బంది ఎదురవుతోంది. అందువల్లే హుస్సేన్ ఈ టోర్నీలో సరికొత్తగా కనిపిస్తున్నాడు. అతడు గనుక ఇదే స్థాయిలో బౌలింగ్ కంటిన్యూ చేస్తే కచ్చితంగా హైదరాబాద్ జట్టులో స్థిరమైన స్థానాన్ని పొందుతాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular