Homeక్రీడలుSRH sixes record IPL 2026: RCB, RR ప్లేయర్లు కాదు.. కాటేరమ్మ కొడుకులే.. సిక్సర...

SRH sixes record IPL 2026: RCB, RR ప్లేయర్లు కాదు.. కాటేరమ్మ కొడుకులే.. సిక్సర పిడుగులు..

SRH sixes record IPL 2026: రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో భీకరమైన బ్యాటర్లు ఉన్నారు. వీరంతా కూడా విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేస్తున్నారు. సాల్ట్ నుంచి మొదలు పెడితే పాటిదార్ వరకు దుమ్మురేపుతున్నారు. 200 కు మించిన పరుగుల లక్ష్యాన్ని కూడా వీరు అత్యంత సులభంగా చేదించగలుగుతున్నారు. ఈ స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ.. వీరి వల్ల కూడా ఆ ఘనత సాధ్యం కావడం లేదు. ముంబై ఇండియన్స్ లో డికాక్ నుంచి మొదలుపెడితే తిలక్ వర్మ వరకు […]

SRH sixes record IPL 2026: రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో భీకరమైన బ్యాటర్లు ఉన్నారు. వీరంతా కూడా విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేస్తున్నారు. సాల్ట్ నుంచి మొదలు పెడితే పాటిదార్ వరకు దుమ్మురేపుతున్నారు. 200 కు మించిన పరుగుల లక్ష్యాన్ని కూడా వీరు అత్యంత సులభంగా చేదించగలుగుతున్నారు. ఈ స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ.. వీరి వల్ల కూడా ఆ ఘనత సాధ్యం కావడం లేదు.

ముంబై ఇండియన్స్ లో డికాక్ నుంచి మొదలుపెడితే తిలక్ వర్మ వరకు సత్తా చూపిస్తున్నారు. వీరంతా కూడా మైదానంలో వీర విహారం చేస్తున్నారు.. వీరిలో డికాక్, తిలక్ వర్మ ఇప్పటికే సెంచరీలు బాదేశారు. ఇంకా మరింత దూకుడుగా బ్యాటింగ్ చేసే సత్తా వీరిలో ఉంది.. ఆ స్థాయి బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ వీరి వల్ల కూడా కాలేదు.

రాజస్థాన్ రాయల్స్ లో యశస్వి జైస్వాల్ నుంచి మొదలుపెడితే వైభవ్ సూర్య వంశీ వరకు ఆకాశమేహద్దుగా చెలరేగిపోతున్నారు. గొప్ప గొప్ప లక్ష్యాలను సైతం వీరు అత్యంత సులువుగా ఫినిష్ చేయగలుగుతున్నారు. అంతస్థాయి బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ.. వీరి వల్ల కూడా కావడం లేదు.

పంజాబ్ జట్టు లో సిమ్రాన్ సింగ్ నుంచి మొదలు పెడితే అయ్యర్ వరకు భీకరంగా ఆడుతున్నారు. వీరంతా కూడా దుమ్ము రేపే రేంజ్ లో బ్యాటింగ్ చేస్తున్నారు. సిక్సర్ లను అత్యంత ఈజీగా కొడుతున్నారు. అందువల్లే పంజాబ్ జట్టు ఇప్పటివరకు ఒక్క ఓటమి లేకుండా దూసుకుపోయింది. అటువంటి పంజాబ్ జట్టు ప్లేయర్ల వల్ల కూడా ఇది సాధ్యం కాలేదు.

ఇంతటి హేమహేమి బ్యాటర్ల వల్ల కూడా కానిది.. హైదరాబాద్ బ్యాటర్లు చేతి చూపిస్తున్నారు. ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. వారు మరెవరో కాదు కాటేరమ్మ కొడుకులు.. పిచ్ చూడటం లేదు. బౌలర్ ఎవరనేది పట్టించుకోవడం లేదు. స్టేడియం ఏదనేది లెక్కపెట్టడం లేదు. బంతిని చూశారంటే చాలు.. గట్టిగా కొడుతున్నారు. బౌండరీ దాటిస్తున్నారు. ఈ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా.. లక్నో మ్యాచ్ మినహాయించి అన్నింట్లోనూ ఇలానే ఆడుతున్నారు. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు బ్యాటర్లు ఏడు మ్యాచ్లు ఆడారు. ఇందులో హైదరాబాద్ జట్టు ప్లేయర్లు ఏకంగా 82 సిక్సర్లు కొట్టారు. ద్వారా సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు.

హైదరాబాద్ జట్టు తర్వాత 69 సిక్సర్లు కొట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లు రెండవ స్థానంలో.. 69 సిక్సర్లు కొట్టి పంజాబ్ ప్లేయర్లు మూడవ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో గుజరాత్ ప్లేయర్లు చివరి స్థానంలో ఉన్నారు. వారు కేవలం 34 సిక్సర్లు మాత్రమే కొట్టడం విశేషం.

ఐపీఎల్ లో కాటేరమ్మ కొడుకులకు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గడిచిన కొన్ని సీజన్లుగా వీరు ఆడుతున్న ఆట అద్భుతంగా ఉంది. గెలుపు, ఓటములను పక్కన పెడితే.. వారు సృష్టించిన విధ్వంసం ఐపిఎల్ రికార్డులలో భద్రంగా ఉంది. అయితే ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ జట్టు.. అత్యధిక సార్లు 200+ స్కోర్లు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లు సూపర్ ఫామ్ లో ఉన్న నేపథ్యంలో ఈసారి 300 లోడింగ్ కచ్చితంగా అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

 

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper