Sreesanth: ఇండియన్ టీం లో సీనియర్ ప్లేయర్ అయిన గౌతమ్ గంభీర్ ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈయన ధోని, విరాట్ కోహ్లీ ల మీద ఎక్కువగా కామెంట్స్ చేస్తూ వాళ్ళ ఫ్యాన్స్ చేత ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. అయితే గంభీర్ ఎప్పుడు కూడా ఇలాంటి మనస్తత్వంతోనే ఉంటూ వస్తున్నాడు… మ్యాచ్ లు ఆడేటప్పుడు ప్లేయర్లతో గొడవలు పెట్టుకోవడం అలాగే తనకు నచ్చని విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేయడం. ఒక ప్లేయర్ ని దూషించడం ఒక ప్లేయర్ ని మెచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటాడు. అందుకే కొంతమంది ఆయన్ని పట్టించుకోవడం కూడా మానేశారు. ఇక ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన శ్రీశాంత్ ని ఫిక్సరంటూ కామెంట్ చేయడం తో మరోసారి గంభీర్ వార్తల్లో నిలవాల్సి వచ్చింది. అసలు శ్రీశాంత్ కి, గంభీర్ కి మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది. అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
అప్పట్లో గౌతమ్ గంభీర్ ఇండియన్ టీమ్ లో ఒక అద్భుతమైన బ్యాటింగ్ స్టాండర్డ్ ఉన్న ప్లేయర్… ఈయన ఆడిన చాలా మ్యాచ్ ల్లో ఇండియన్ టీమ్ కి భారీ పరుగులు చేస్తూ టీమ్ విజయం లో కీలకపాత్ర వహించాడు.ఆయన ప్లేయర్ గా ఒకే కానీ తోటి ప్లేయర్లతో సన్నిహిత సంభందాలని మెయింటైన్ చేయడం లో మాత్రం తను ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటాడు…ఇక శ్రీశాంత్ కూడా అదే రేంజ్ లో తను మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు గ్రౌండ్ లో చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు. ఇక వీళ్లిద్దరూ కలిసి ఇండియన్ టీమ్ తరుపున 49 మ్యాచ్‌ల్లో ఆడారు. వీళ్ళు టీమ్ లో మ్యాచులు ఆడినప్పుడు చాలా సన్నిహితంగా ఉండేవారు.ముఖ్యంగా 2007 టి20, 2011 వన్డే వరల్డ్ కప్ ల్లో ఇండియన్ టీమ్ కి వరల్డ్ కప్ రావడం లో వీళ్ళు కూడా ముఖ్య పాత్ర వహించారు.
ఇక వీళ్లిద్దరూ ఇప్పుడు రిటైర్ అయ్యారు కాబట్టి సీనియర్ ప్లేయర్లు గా లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ)లో ఆడుతున్నారు. ఇక అదే క్రమంలో ఇద్దరు కూడా చిన్న విషయానికే ఆవేశానికి గురు అయ్యే మనుషులు కాబట్టి రీసెంట్ గా వీళ్ళ మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. ముందుగా గంభీర్ శ్రీశాంత్ ని ఫిక్సర్ అంటూ కామెంట్ చేశాడు దానికి శ్రీశాంత్ నవ్వుతూ యాక్సెప్ట్ చేసినప్పటికీ ఇక అక్కడితో ఆగకుండా గంభీర్ పదే పదే ఫిక్సర్ ఫిక్సర్ అంటూ కామెంట్లు చేయడంతో శ్రీశాంత్ కి కోపం వచ్చింది ఇక దానితో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.అయితే ఈ సంఘటన బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో చోటు చేసుకుంది.ఇక ఈ మ్యాచ్ తర్వాత శ్రీశాంత్ నా తప్పు ఏమీ లేకపోయినా గంభీర్ నన్ను పదే పదే అలా అనడం కరెక్ట్ కాదు అంటూ ఒక వీడియో ని రిలీజ్ చేశాడు…
ఇక శ్రీశాంత్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా గంభీర్ దానికి సమాధానం గా తన ట్విట్టర్ లో ఒక స్మైల్ పిక్ ని పోస్ట్ చేశాడు. అయితే 2013 లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ కేసు లో ఇరుక్కొవడం తో బిసిసిఐ తనకి జీవితకాలపు నిషేదం విధించింది.ఇక సుప్రీం కోర్టు ఆదేశాలతో దాన్ని 7 సంవత్సరాలకు కుదించారు ఇక 2020 లో అతని పైన ఉన్న నిషేధం తొలగిపోయింది… కానీ ఇప్పుడు గంభీర్ ఇలా ఆయన్ని ఫిక్సర్ అంటూ కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు…
S Sreesanth on Gautam Gambhir:
"He kept calling me a fixer".pic.twitter.com/qPtSdEXTjp
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2023