Prithvi Shaw – Yashasvi Jaiswal : టీమిండియా అండర్ 19 వరల్డ్ కప్ గెలిచింది. అప్పుడు జట్టుకు పృథ్వీ షా నాయకత్వం వహించాడు. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అప్పటికి పృథ్వీ వయసు 18 సంవత్సరాలు మాత్రమే. అయినప్పటికీ అచంచలమైన నాయకత్వ పఠిమ ను దర్శించాడు. అంతకంటే ముందు పాఠశాల క్రికెట్లో ఏకంగా 546 మారథాన్ ఇన్నింగ్స్ తో సంచలనం సృష్టించాడు. తొలి రంజీ మ్యాచ్లో సెంచరీ చేశాడు. తొలి దులీప్ ట్రోఫీలో శతకం సాధించాడు.. అంతేకాదు టెస్ట్ క్రికెట్ లో ప్రారంభ మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు. కానీ ఆ తర్వాత పృథ్వీ ఆ స్థాయిలో ఆడు లేకపోయాడు. భారీగా బరువు పెరిగిపోయాడు. ఫామ్ ను కోల్పోయాడు.. సగటు భారతీయ క్రికెటర్ లో ఉండాల్సిన ఒక కంటే ఎక్కువ పెంచుకున్నాడు. చివరికి ఒక సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ తో గొడవపడ్డాడు. డోపింగ్ నిబంధనలు అతిక్రమించి బీసీసీఐ నిషేధానికి గురయ్యాడు. అయినప్పటికీ ముంబై క్రికెట్ సంఘం ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అయితే అతడు మారలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఐపీఎల్ లో అతడిని అనేకసార్లు అంటిపెట్టుకుంది. అయినప్పటికీ అతని ఆట తీరులో మార్పు రాలేదు. దీంతో ఈసారి అతడిని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. “నీలో మంచి ప్రతిభ ఉంది. దానికంటే క్రమశిక్షణ చాలా అవసరం. అది ముందు అలవర్చుకుంటే బాగుంటుంది” కెరియర్ ప్రారంభంలో పృథ్వీ కి సచిన్ ఇచ్చిన సలహా అది. నాడు సచిన్ ఆ మాటలు ఎందుకన్నాడో..నేడు పృథ్వీకి అర్థమయ్యే ఉంటుంది. పృథ్వీ గొప్ప ఆటగాడు.. ఒక్కసారి క్రీజ్ లో కుదురుకుంటే చాలు మైదానం నలుమూలల షాట్లు కొట్టగలడు. 18 సంవత్సరాల వయసులోనే భారత టెస్ట్ క్రికెట్ జట్టులో అవకాశాన్ని దక్కించుకున్నాడు. అంతేకాదు సెంచరీ కూడా చేశాడు. కానీ ఇప్పుడు కెరియర్ తిరోగమనంలో ఉంది. అతని శరీరం అదుపుతప్పింది. అతడి శరీరాకృతి ఇప్పుడు చూస్తే క్రికెటరేనా అనే అనుమానం కలుగుతుంది.
యశస్వి తీరు వేరు
ఇక పృథ్వీ షా అండర్ -19 లో మెరుస్తున్నప్పుడే యశస్వి కూడా తన కెరియర్ మొదలు పెట్టాడు. కాకపోతే ఇతడు నేపథ్యం వేరు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్లో భారత్ ఓడిపోయిన తర్వాత యశస్వి తనను తాను ఆవిష్కరించుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. కాంక్రీట్ మైదానంపై సాధన చేశాడు. సింథటిక్ బంతుల సహాయంతో రెండు రోజుల వ్యవధిలో 200 ఓవర్ల పాటు ప్రాక్టీస్ చేశాడు. దీనిని బట్టి క్రికెట్ మీద అతడికి ఉన్న ఆసక్తి ఎలాంటిదో అర్థమవుతుంది. నిరంతర సాధన ద్వారా మాత్రమే అంతర్జాతీయ క్రికెట్లో రాణించగలమని సచిన్ సలహాలను అతడు ఆచరణలో పెట్టి నిరూపిస్తున్నాడు. ఫిట్ నెస్ విషయంలో యశస్వి సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాడు. డబ్బు, అచంచలమైన కీర్తి వచ్చినప్పటికీ అతడు ఏకాగ్రతను ఏమాత్రం కోల్పోలేకపోతున్నాడు. పరుగుల దాహాన్ని తగ్గించుకోలేకపోతున్నాడు. అతని ఆట తీరు చూసి సునీల్ గవాస్కర్ లాంటి ఆటగాడు కూడా మంత్రముగ్ధుడైపోయాడు.”అతడి ఆట తీరు అమోఘం.. ఇంకా ఏదో సాధించాలి అనే అతని తపన గొప్పగా అనిపిస్తోందని” సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. వాస్తవానికి యశస్వి కూడా పృథ్వీ లాగే క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతడి నేపథ్యం పూర్తి విభిన్నం. క్రికెట్ మీద ఇష్టంతో ముంబై నగరానికి పారిపోయి వచ్చాడు. నిలువ నీడలేని సందర్భంలో ఒక టెంట్ కింద తలదాచుకున్నాడు. స్టేడియంలో ఉంటూ ఆటగాళ్లకు సహాయకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగాడు. టీమిండియాలో సంచలన ఆటగాడిగా పేరుపొందాడు. సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు.. స్థూలంగా యశస్వి ఓ క్రికెటర్ ఎలా ఉండాలో చెబితే..పృథ్వీని చూస్తే ఒక క్రికెటర్ ఎలా ఉండకూడదో తెలుస్తుంది. ఒకప్పుడు పృథ్వీ ని చాలామంది భావి సచిన్ అవుతాడని అనుకున్నారు. కానీ అతడేమో పాతాళానికి వెళ్ళిపోయాడు. యశస్వీ మాత్రం తనను తాను ఆవిష్కరించుకుంటూ.. తనమీద తానే ప్రయోగాలు చేసుకుంటూ.. గొప్ప ఆటగాడిగా వెలుగొందుతున్నాడు.