https://oktelugu.com/

YS Jagan : ఆదానీ నుంచి ముడుపులు.. జగన్ సంచలన కామెంట్స్

జాతీయస్థాయిలో పెను దుమారానికి దారితీసింది ఆదాని ముడుపుల వ్యవహారం. పార్లమెంట్ సమావేశాల్లో సైతం ఇదే హైలెట్ అవుతోంది. ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం జగన్ ముడుపులు తీసుకున్నారన్నది రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణ. దీనిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చారు జగన్.

Written By:
  • Dharma
  • , Updated On : November 28, 2024 / 07:38 PM IST

    YS Jagan

    Follow us on

    YS Jagan : మాజీ సీఎం జగన్ నోరు విప్పారు. అదాని వ్యవహారంపై వివరణ ఇచ్చారు. ముడుపుల వ్యవహారాన్ని తోసిపుచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. అరెస్టుల తీరు సరికాదన్నారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదన్న విషయాన్ని గ్రహించుకోవాలని హెచ్చరించారు. దీనికి రెట్టింపు రివెంజ్ తీర్చుకుంటామని హెచ్చరికలు పంపారు. చంద్రబాబుకు పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీశారని ఆరోపించారు. ప్రత్యర్థులపై రాజకీయం చేయడమే ఆయన పని అంటూ విరుచుకుపడ్డారు జగన్. ప్రస్తుతం జగన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆదాని వ్యవహారంలో జగన్ ఎలా స్పందిస్తారని అంతా భావించారు. దానిపై ఈరోజు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

    * రూ.100 కోట్ల పరువు నష్టం దావా
    విద్యుత్ ఒప్పందాల విషయంలో ఏపీ పాలకులకు భారీగా ముడుపులు ముట్టాయి అన్నది అమెరికాలోని ఓ దర్యాప్తు సంస్థ చేసిన ఆరోపణ. అక్కడ కోర్టులో ఏపీ చీఫ్ మినిస్టర్ ప్రస్తావన తీసుకొచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే నేరుగా తన పేరు ఎక్కడా లేదని చెబుతున్నారు జగన్. కేవలం తన పరువుకు భంగం కలిగించేందుకే ఈ ఆరోపణలు చేశారని చెబుతున్నారు. వారిపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని చెప్పుకొచ్చారు జగన్.

    * విద్యుత్ ఒప్పందాల విషయంలో కాదు
    తనను అదాని కలిసింది విద్యుత్ ఒప్పందాల విషయంలో కాదని తేల్చి చెప్పారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశానని.. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా చాలామంది తో కలిసి పని చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తాను ముడుపులు తీసుకున్నాను అనడానికి ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఆరోపణలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు జగన్. గత కొంతకాలంగా తనపై జరుగుతున్న దుష్ప్రచారం తోనే తాను మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని జగన్ ప్రకటించడం సంచలనం రేకెత్తిస్తోంది.