U19 Women’s World Cup Final: బ్యాటింగ్ బాగుంటుంది. బౌలింగ్ అద్భుతంగా ఉంటుంది. ఫీల్డింగ్ మై మరిపించేలా చేస్తుంది.. అయినప్పటికీ సౌత్ఆఫ్రికాను దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. అందువల్లే ఆ జట్టు ఇంతవరకు ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీని గెలవలేకపోయింది. గత ఏడాది జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో భారత్ చేతిలో ఓడిపోయిన దక్షిణాఫ్రికా..ఈ ఏడాది అండర్ -19 ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో ఆ జట్టు దురదృష్టంపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే వీటి కంటే ముందు దక్షిణాఫ్రికా అండర్ 19 ఉమెన్స్ జట్టు కెప్టెన్ చేసిన వ్యాఖ్యలు కన్నీటిని తెప్పిస్తున్నాయి.
ఐసీసీ మెగా టోర్నీలలో దక్షిణాఫ్రికా జట్టు గొప్ప ప్రదర్శనే చేస్తుంది. కానీ టైటిల్ కు చేరువయ్యే సమయం నాటికి ఆ జట్టు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. దీంతో ఫైనల్ పోరులో చేతులెత్తేస్తుంది. అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ లోనూ దక్షిణాఫ్రికా జట్టుకు ఇదే దుస్థితి ఎదురయింది. ఇటీవల జరిగిన ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై టైటిల్ చేజర్చుకుంది.. అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ లోనూ ఇదే దుస్థితి ఎదురయింది.. నీతో సౌత్ఆఫ్రికా జట్టు కెప్టెన్ కైలా రెనేకే ఒక్కసారిగా భావోద్వేగానికి గురయింది. మ్యాచ్ అనంతరం ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ” అమ్మానాన్నా నన్ను క్షమించండి. సౌత్ ఆఫ్రికా జట్టు నాకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఈ ఓటమి మమ్మల్ని కుంగ దీసింది. టోర్నీ మొత్తం మా శక్తి యుక్తులను ప్రదర్శించాం. కానీ ఫైనల్ మ్యాచ్లో మా స్థాయి సరిపోలేదు. మా శక్తి ప్రత్యర్థి జట్టు ముందు నిలబడలేదు. అందువల్లే ఇలా తలవంచక తప్పలేదు.. అయితే త్వరలోనే మళ్లీ పుంజుకుంటాం. శక్తి యుక్తులను కూడ తీసుకుంటాం. కచ్చితంగా గెలుపును సాధిస్తాం. అందులో ఏమాత్రం అనుమానం లేదని” కైలారెనేకే వ్యాఖ్యానించింది.. కైలా ఫైనల్ మ్యాచ్లో బ్యాటింగ్లో తీవ్రంగా నిరాశపరిచింది.. 21 బంతులు ఎదుర్కొన్న ఆమె కేవలం ఏడు పరుగు లు మాత్రమే చేసింది. ఇక ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా పై విజయం సాధించింది. ముందుగా దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ చేసి 82 పరుగులు మాత్రమే చేయగలిగింది. 83 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన భారత జట్టు 11.2 ఓవర్లు కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి.. విజయాన్ని అందుకుంది. భారత జట్టు విజయంలో త్రిష కీలకపాత్ర పోషించింది. మూడు వికెట్ల తీయడంతో పాటు, 40 కి పైగా పరుగులు చేసి సత్తా చాటింది.
దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ మ్యాచ్లో ఓడిపోవడంతో నెట్టింట తీవ్రమైన చర్చ జరుగుతోంది. అన్ని మ్యాచ్లు ఆడి.. అన్నింటిలోనూ గెలిచి చివరికి ఫైనల్ మ్యాచ్లో ఓడిపోవడం దారుణమని నెటిజన్లు పేర్కొంటున్నారు..” ఆ జట్టు దురదృష్టానికి దగ్గరలో ఉంటుంది కావచ్చు. లేకపోతే ప్రతిసారి ఫైనల్ మ్యాచ్లోనే ఓడిపోతుంది. దీనివల్ల ఆ జట్టు దురదృష్టకరమైన టీం గా మారిపోతున్నది.. ఒకటి కాదు రెండు కాదు అనేక ఫైనల్ మ్యాచ్లలో ఇలానే ఓడిపోయింది. మెన్, ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ ల ను ఓడిపోయింది. ఇప్పుడేమో ఇలా తలవంచుకున్నది..పాపం దక్షిణాఫ్రికా జట్టు అంటూ” నెటిజన్లు తమనిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Emotional South Africa skipper Kayla Reyneke after losing the U19 World Cup final. pic.twitter.com/fDh3cJGyda
— CricketGully (@thecricketgully) February 2, 2025