SA Vs Ind 1 Test: రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా సత్తా చూపించింది.. కోల్ కతా వేదికగా మొదలైన తొలి టెస్ట్ మూడు రోజుల్లోనే ముగిసింది.. వాస్తవానికి తొలి ఇన్నింగ్స్ లో 30 పరుగుల లీడ్ కొనసాగించిన టీమిండియా.. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం దారుణంగా ఆడింది.. అందువల్లే ఫలితం పర్యాటక జట్టుకు అనుకూలంగా మారిపోయింది.. వాస్తవానికి టీం ఇండియా నుంచి ఇలాంటి ఆట తీరును సగటు అభిమాని ఊహించలేదు. కేఎల్ రాహుల్ నుంచి మొదలుపెడితే పంత్ వరకు అద్భుతమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ స్పిన్ బౌలింగ్ కు దాసోహం అయ్యారు..
దక్షిణాఫ్రికా విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో టీమిండియా కేవలం 93 పరుగులకే ఆల్ అవుట్ అయింది. వాషింగ్టన్ సుందర్ (31) మినహా మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు.. జైస్వాల్ (0), రాహుల్ (1), జూరెల్ (13), పంత్ (2), జడేజా (18), కులదీప్ యాదవ్ (1*), మహమ్మద్ సిరాజ్ (0) అత్యంత చెత్త ఆట తీరు ప్రదర్శించారు. చివర్లో అక్షర్ పటేల్ (26) దూకుడు కొనసాగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కెప్టెన్ గిల్ తీవ్రమైన మెడ నొప్పితో బ్యాటింగ్ చేయలేకపోయాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో హార్మోర్ నాలుగు, జాన్సన్ రెండు, కేశవ్ మహారాజ్ 2 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు.. మార్క్రం ఒక వికెట్ పడగొట్టాడు..
వాస్తవానికి ఈ మ్యాచ్లో గెలుస్తామని అత్యుత్సాహం టీమిండియా కొంపముంచింది. తొలి ఇన్నింగ్స్ లో 30 పరుగులకు మించి లీడ్ లభించినప్పటికీ దానిని టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 159, టీమిండియా 180 పరుగులు చేశాయి. 30 పరుగుల లోటు ఇన్నింగ్స్ ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికా జట్టు రెండవ ఇన్నింగ్స్ లో 153 పరుగులకు ఆల్ అవుట్ అయింది. బవుమా 55* పరుగులు చేశాడు. బోస్ 25 పరుగులతో అతనికి అండగా నిలిచాడు. తద్వారా టీమిండియా ఎదుట దక్షిణాఫ్రికా 124 ట్రాన్స్ టార్గెట్ విధించింది.
వాస్తవానికి బవుమా, బోష్ ఎనిమిదో వికెట్ కు ఏకంగా 44 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది.. వాస్తవానికి కోల్కతా మైదానం మీద టీం ఇండియాకు మంచి రికార్డు ఉన్నప్పటికీ.. స్వల్పస్కోరును ఫినిష్ చేయడంలో టీమిండియా ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా స్పిన్ బౌలింగ్ కు దాసోహం అయ్యారు. ఈ ఓటమి ద్వారా టీమిండియా చాలా పాఠాలు నేర్చుకోకపోతే తదుపరి తీవ్రంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఏ ఒక్క ఆటగాడు కూడా నిలబడకపోవడం వల్ల ఆ స్వల్పస్ స్కోర్ కూడా చేజ్ చేయలేకపోయింది టీమిండియా.