ODI World Cup 2023 : వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి జట్టు కూడా తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తూ వరుస విజయాలను అందుకుంటుంటే ఆస్ట్రేలియా టీం మాత్రం చాలా దారుణమైన పేలవ పెర్ఫార్మన్స్ ని ఇస్తూ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి సెమిస్ ఆశల మీద నీళ్లు జల్లుకుంటు ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలో ఆస్ట్రేలియా నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా టీం మీద 134 పరుగుల భారీ స్కోర్ తేడాతో ఓడిపోయింది.
ఇక ఇప్పటివరకు ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లో గత కొన్ని సంవత్సరాల కాలంలో ఇంత భారీ స్కోర్ తేడాతో అయితే ఎప్పుడు ఓడిపోలేదు.1983 లో ఇండియా చేతిలో ఆస్ట్రేలియా 118 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఆ సంవత్సరం ఇండియా వరల్డ్ కప్ సాధించడం జరిగింది.ఇక దాదాపు 40 సంవత్సరాల తర్వాత మళ్లీ సౌత్ ఆఫ్రికా టీం మీద ఇప్పుడు 134 పరుగుల భారీ స్కోర్ తేడాతో ఓడిపోవడం అనేది ఆ టీమ్ పేలవమైన ప్రదర్శనకు నిదర్శనం గా కనిపిస్తుంది. వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా కు ఇది ఒక చెత్త రికార్డు అనే చెప్పాలి. ఇంకా ఇప్పటివరకు ఈ టీం వరల్డ్ కప్ లో నాలుగు సార్లు 200 పరుగుల లోపే అలౌట్ అవ్వడం జరిగింది. గతంలో న్యూజిలాండ్ పైన 151 పరుగులు, అలాగే పాకిస్తాన్ పైన 176 పరుగులు, ఇక మొన్న జరిగిన ఇండియా మ్యాచ్ లో 199, నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో 177 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇక ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ వరల్డ్ కప్ లో వరుస విజయాలను నమోదు చేసుకొని పాయింట్స్ టేబుల్ లో టాప్ పొజిషన్ కోసం పోటీ పడుతుంటే ఆస్ట్రేలియా టీం మాత్రం ఒక్క మ్యాచ్ గెలవడానికి నానా తంటాలు పడుతుంది.ఇక వరల్డ్ కప్ కి ముందు ఇండియా తో ఆడిన మూడు వన్డేల సిరీస్ లో కూడా ఇండియన్ టాప్ బ్యాట్స్ మెన్స్ అయిన కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్ళు లేకపోయినప్పటికీ ఇండియన్ టీం లో ఉన్న జూనియర్ ప్లేయర్స్ తో ఆడిన మ్యాచ్ ల్లో కూడా ఆస్ట్రేలియా ఓడిపోయి అప్పుడే వాళ్ల టీమ్ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో ప్రపంచానికి తెలియజేసింది.ఇక వరల్డ్ కప్ లో కూడా అదే పేలవమైన పర్ఫామెన్స్ ని కొనసాగిస్తుంది.
ఆస్ట్రేలియన్ టీంలో టాప్ బ్యాట్స్ మెన్స్ అయిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ,మిచేల్ మార్ష్ , గ్లెన్ మాక్స్ వెల్ లాంటి బ్యాట్స్ మెన్స్ ఉన్నప్పటికీ అలాగే బౌలర్లలో ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్న హజీల్ వుడ్ , స్టార్క్ , కమ్మిన్స్ లాంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా టీమ్ మాత్రం దారుణంగా ఫెయిల్ అవుతూ వస్తుంది.ఇక ఆస్ట్రేలియా సెమీస్ కి వెళ్లే ఆశలు సజీవంగా ఉంచుకోవాలి అంటే ఇకమీదట జరిగే అన్ని మ్యాచ్ లను గెలుచుకుంటూ రావాలి లేకపోతే ఇక్కడున్న పోటీని తట్టుకొని నిలబడడం కష్టం అనే చెప్పాలి…