icc world test championship : కంగారు జట్టుతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గెలిచి ప్రోటీస్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాదు సుదీర్ఘ ఫార్మాట్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది.. వరుసగా అత్యధిక టెస్ట్ విజయాలు సాధించి అద్భుతమైన ఘనతను అందుకుంది. 2002లో మార్చి 9 నుంచి మే 2023 వరకు 9 టెస్టులు ఆడిన దక్షిణాఫ్రికా.. అన్నింట్లోని విజయాలు సాధించింది. ఇక గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు దక్షిణాఫ్రికా 8 వరుసగా టెస్ట్ విజయాలు సాధించింది. తన రికార్డును తానే బద్దలు కొట్టుకోవడానికి రెడీగా ఉంది.. ఇక సారధిగా బవుమా కూడా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్ జట్టు సారధి పెర్సి చాప్ మన్ రికార్డును సమం చేశాడు..చాప్ మన్ ఆంగ్ల జట్టు తరఫున సారధిగా మొదటి పది టెస్టులలో 9 విజయాలు జట్టుకు అందించాడు.. ఇక ఈ జాబితాలో బవుమా 9 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు.. ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ డగ్లస్ జార్దిన్, ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ వార్విక్ ఆర్మ్ స్ట్రాంగ్, ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ హసెట్, పాకిస్తాన్ జట్టు కెప్టెన్ వకార్ యునిస్, ఆస్ట్రేలియా కెప్టెన్ పాంటింగ్, ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ 8 విజయాలు అందించి తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు..
ఇక ఐసీసీ టోర్నమెంట్ పరంగా చూసుకుంటే..
దక్షిణాపిక 1998లో ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన ఫైనల్ లో విజయం సాధించింది.
2023లో మహిళల టి20 ప్రపంచ కప్ ను దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
2024 మహిళల టి20 ప్రపంచ కప్లో ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోయింది.
ఇక ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ తుది పోరులో కంగారు జట్టుపై సఫారీ పురుషుల జట్టు విజయం సాధించింది.
అయితే ఐసీసీ నిర్వహించిన ప్రతి మేజర్ టోర్నీ తుది పోరులో సఫారీలు రెండవసారి బ్యాటింగ్ చేయడం విశేషం..
ఇక లార్డ్స్ మైదానంలో అత్యధిక పరుగుల చేదన చేసి గెలిచిన జట్టుగా సఫారీ బృందం రెండో స్థానంలో నిలిచింది.
1984లో ఇంగ్లాండ్ విధించిన 342 పరుగుల టార్గెట్ ను వెస్టిండీస్ చేజ్ చేసింది. ఈ మైదానంలో ఇప్పటివరకు ఇదే రికార్డుగా కొనసాగుతోంది.
ఇక ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ తుది పోరులో ఆస్ట్రేలియా విధించిన 282 రన్స్ టార్గెట్ ఫినిష్ చేసి సౌత్ ఆఫ్రికా సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది.
2004లో న్యూజిలాండ్ విధించిన 282 రన్స్ టార్గెట్ ను ఇంగ్లీష్ జట్టు ఫినిష్ చేసి.. ఇప్పుడు థర్డ్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది.
2022లో న్యూజిలాండ్ విధించిన 277 రన్స్ టార్గెట్ ను ఇంగ్లాండ్ ఫినిష్ చేసింది. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.
1965లో న్యూజిలాండ్ విధించిన 216 పరుగుల టార్గెట్ ను ఇంగ్లాండ్ జట్టు ఫినిష్ చేసింది.
ఇక టెస్టులలో 250 కంటే ఎక్కువ టార్గెట్ విజయవంతంగా ఛేదించడం సౌత్ ఆఫ్రికా జట్టుకు ఇది ఆరవసారి. ఆస్ట్రేలియాపై 250 కంటే ఎక్కువ పరుగుల టార్గెట్ విజయవంతంగా ఫినిష్ చేయడం సౌత్ ఆఫ్రికాకు ఇది నాలుగోసారి..
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత లార్డ్స్ లో జరిగిన 24 టెస్ట్ లలో ఆస్ట్రేలియాకు ఇది మూడవ ఓటమి. గతంలో 2009 లో జరిగిన యాషెస్, 2013లో జరిగిన యాసెస్ సిరీస్లలో ఆస్ట్రేలియా ఓడిపోయింది.. లార్డ్స్ లో దక్షిణాఫ్రికా జట్టు 8 టెస్టులు అడగా.. ఆరింట్లో గెలిచింది.