Sachin Tendulkar: క్రికెట్ లో దేవుడెవరంటే ఠక్కున సమాధానం చెబుతారు సచిన్ టెండుల్కర్ అని. క్రికెట్లో ఆయనకున్న రికార్డులు అన్ని ఇన్ని కావు. సెంచరీలు, హాఫ్ సెంచరీలు, బౌండరీలు తదితర విషయాల్లో ఆయనకున్న క్రెడిట్ ఏంటో అందరికి తెలిసిందే. క్రికెట్ లో ఆయనకున్న కీర్తిప్రతిష్టలు మామూలువి కావు. సచిన్ అంటేనే క్రికెట్. ఇంత భారీ క్రెడిట్ దక్కించుకున్న సచిన్ రిటైర్ మెంట్ తరువాత క్రికెట్ తో సంబంధాలు దాదాపుగా తెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. సచిన్ సేవలను భారత క్రికెట్ జట్టు ఉపయోగించుకోవాలనుకుంటోందని చెప్పి అందరిలో ఆసక్తి పెంచాడు. ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, భారత జట్టు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్, ఎన్ సీఏ హెడ్ గా వీవీఎస్ లక్ష్మణ్ లు సేవలందిస్తున్న సంగతి విధితమే.
భారతరత్న అవార్డు గ్రహీత అయిన సచిన్ క్రికెట్లో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. సచిన్ లాంటి వ్యక్తి భారత జట్టులో ఉండటం అవసరం ఉందని గుర్తిస్తున్నారు. అయితే సచిన్ ను టీమిండియా బ్యాకప్ స్టాఫ్ లో నియమించడం కోసం గంగూలీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన సేవలను వినియోగించుకుని జట్టును ముందుకు నడిపించడం అనివార్యంగా చెబుతున్నారు.
Also Read: Kohli vs Ganguly: కోహ్లీ వర్సెస్ గంగూలీ.. పరస్పర విరుద్ధ ప్రకటనలు?
2013లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన సచిన్ తరువాత క్రికెట్ తో సంబంధాలు లేకుండానే ఉన్నారు.కానీ ఆయన సేవలను అందుకోవాలనే ఉద్దేశంతో గంగూలీ సచిన్ ను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. దీని కోసమే టీమిండియా జట్టు కోసం అతడిని తీసుకొచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. జట్టు సభ్యులకు మార్గనిర్దేశం చేయాలనే ఉద్దేశంతోనే ఆయనను రప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
Also Read: Team India: టీమిండియాలో ఆధిపత్యపోరుకు ముగింపు పలికేదెవరు?