Vaibhav Suryavanshi trophies: అది మామూలు విధ్వంసం కాదు. మాటలకు అందని పరాక్రమం. అంచనాలకు ఉందని అజేయం . పనికిమాలిన తోటి ప్లేయర్ల వల్ల అతని కష్టానికి గుర్తింపు లేకుండా పోయింది కానీ.. ఆ జట్టు ప్లేయర్లు కూడా అతని మాదిరిగా ఆడి ఉంటే రేంజ్ వేరే విధంగా ఉండేది. తను ఒక వజ్రాయుధం ఎలా వాడుకోవాలో రాజస్థాన్ యాజమాన్యానికి తెలియలేదు. రాజస్థాన్ ప్లేయర్లకు కూడా తెలియలేదు. అది వారి దురదృష్టం. ఇంతకంటే పచ్చిగా చెప్పడానికి ఏమీ లేదు.
ఐపీఎల్ లో వైభవ్ సూర్య వంశీ విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశాడు. మామూలుగా అయితే గొప్ప గొప్ప ప్లేయర్లు ఐపీఎల్లో సత్తా చూపిస్తారు. కానీ ఒక అన్ క్యాప్డ్ ఆటగాడిగా వైభవ్ సునామీని సృష్టించాడు అని చెప్పవచ్చు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా అదరగొట్టిన అతడు..ఎమర్జింగ్ ప్లేయర్.. మోస్ట్ సిక్సెస్ (72 సిక్సర్లు), సూపర్ స్ట్రైకర్ (237.31 స్ట్రైక్ రేట్), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్.. ఇలా అయిదు అవార్డులను సొంతం చేసుకున్నాడు. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే ప్లేయర్లు ఉన్నప్పటికీ.. సూర్య వంశీ ఎక్కడా తగ్గలేదు. ప్రత్యర్థి బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. మైదానంలోకి దిగడమే ఆలస్యం ఎదురు దాడి మొదలుపెట్టేవాడు. వాస్తవానికి ఈ సీజన్లో అతడు ఒక్క సెంచరీ మాత్రమే చేశాడు. మూడుసార్లు సెంచరీ ముందు అవుట్ అయ్యాడు. ఒకవేళ అలా అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే అతని ఖాతాలో మూడు సెంచరీలు ఉండేవి.
సూర్య వంశీ ఈ సీజన్ లో తన ఆట తీరు పూర్తిగా మార్చుకున్నాడు.. జట్టు గెలిచినప్పుడు ఎగిరి సంబరాలు చేసుకోవడం.. ఓడిపోయినప్పుడు కన్నీరు పెట్టడం వంటి గుణంతో చాలామంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు సీనియర్ ప్లేయర్లు ఎదురు పడినప్పుడు వారి ఆశీర్వాదం తీసుకునేవాడు. అంతటి సునీల్ గవాస్కర్ సూర్య వంశీని ఉద్దేశించి లగేరహో బేటా అన్నారు అంటే.. అతడు ఏ స్థాయిలో ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఎంత ఆడినా సరే ఒదిగి ఉంటున్నాడు. మైదానంలో చిచ్చరపిడుగు మాదిరిగా కనిపిస్తున్న అతడు.. తన లౌక్యమైన గుణంతో అందరి ప్రేమను పొందుతున్నాడు. ఐపీఎల్ లో దాదాపు ఐదు కీలకమైన అవార్డులను అతడు సొంతం చేసుకున్నాడు అంటే.. మామూలు విషయం కాదు.
సూర్య వంశీ ఇదే జోరు కొనసాగిస్తే అతడికి అడ్డు అనేది ఉండదు. ఈ సీజన్లో రాజస్థాన్ మూడో స్థానం వరకు వచ్చేసింది. కానీ వచ్చే సీజన్లో మాత్రం సూర్య వంశీ మరింత షైన్ అవుతాడు. అప్పుడు ఆర్ఆర్ జట్టు కచ్చితంగా విజేతగా నిలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అతడు జట్టును ముందుండి నడిపించడంలో ఫియర్లెస్.. రిలెంట్ లెస్.. అన్ స్టాపబుల్ క్రికెట్ ఆడుతున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు.
Swept the field with his skills. Swept the season with awards
1️⃣5️⃣ years old and already needing a bigger trophy cabinet #TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/bIYKIHfgRD
— IndianPremierLeague (@IPL) May 31, 2026
