India vs Afghanistan: వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మీద ఇండియా ఒక భారీ మ్యాచ్ గెలిచి వరల్డ్ కప్ లో మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆస్ట్రేలియా తో ఆడిన మ్యాచ్ లో ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించే సత్తా ఉన్న శుభ్ మన్ గిల్ లేని లోటు అయితే చాలా స్పష్టం గా కనిపించింది. ఎందుకంటే గిల్ ఉండి ఉంటే వరుసగా ముగ్గురు డకౌట్లు అయ్యే అవకాశం ఉండకపోయేది ఆయన కొంచెం నిదానంగా ఆడుతూ వికెట్లని పడకుండా కాపాడేవాడు.
కానీ డెంగ్యూ ఫీవర్ కారణంగా ఆయన మొదటి మ్యాచ్ కి దూరమైన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఇండియా అఫ్గనిస్తాన్ తో జరిగే రెండో మ్యాచ్ కి కూడా ఆయన అందుబాటులో ఉండడం లేదని తెలుస్తుంది.ఎందుకంటే ఆయన ఇప్పుడిప్పుడే ఫీవర్ నుంచి కోలుకుంటున్నాడు కాబట్టి ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం. ఇక ఇలాంటి సమయంలో రెండో మ్యాచ్ లో ఆయనని ఆడించి రిస్క్ తీసుకోలేము అన్నట్టుగా ఇండియన్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ ,అలాగే కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఇద్దరు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు ఫీవర్ తగ్గిన కూడా రెస్ట్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది.
కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ తో ఆడే మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ ఆడే అవకాశం చాలా తక్కువ… ఇక మళ్ళీ ఆయన ప్లేస్ లో ఇషాన్ కిషన్ ఆడుతూ ఓపెనర్ ప్లేయర్ గా ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఆ విషయం తెలుసుకున్న చాలామంది ఇండియన్ అభిమానులు మాత్రం అఫ్గానిస్థాన్ మ్యాచ్ లో గిల్ అందుబాటులో లేకపోయినా పర్వాలేదు కానీ దానీ తర్వాత 14 వ తేదీన పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కి మాత్రం శుభ్ మన్ గిల్ తప్పకుండా అందుబాటులో ఉండాలి ఆయన ఉంటేనే టీం అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది.
అలాగే పాకిస్తాన్ టీమ్ ని ఎదుర్కోవడంలో మన టీం కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది అంటూ అభిమానులతో పాటు మన సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇషాన్ కిషన్ కూడా మంచి ప్లేయర్ అయినప్పటికీ ఆయన అనుకోకుండా ఆస్ట్రేలియా మ్యాచ్ లో డక్ అవుట్ అవ్వడం జరిగింది.దాంతో క్రికెట్ అభిమానులు అందరూ కూడా గిల్ వస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక గిల్ రెండో మ్యాచ్ కి కూడా అందుబాటులో ఉండడం లేదు అనే విషయాన్ని తెలుసుకున్న కొంత మంది క్రికెట్ అభిమానులు కొంతవరకు బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇండియా అడబోయే మ్యాచ్ ల్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ల మీద వరుసగా రెండు విజయాలను కనుక నమోదు చేసుకుంటే ఇండియా మొత్తం టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ లకు మూడు మ్యాచులు గెలుస్తుంది.కాబట్టి సెమీస్ కి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆఫ్ఘనిస్తాన్ మీద ఆడే మ్యాచ్ లో గిల్ అందుబాటులో లేనప్పటికీ పాకిస్తాన్ మీద ఆడే మ్యాచ్ లో మాత్రం గిల్ అందుబాటు లో ఉండాలి. అలా అయితేనే ఇండియా మరింత స్ట్రాంగ్ గా పాకిస్తాన్ మీద ఎదురు దాడి చేయగలుగుతుంది…