IPL-2023 : శుభ్ మన్ గిల్ సోదరిని వదలరా బాబూ.. మీకు చుక్కలే ఇక

గిల్ సోదరిపై అనుచిత వ్యాఖ్యలను చేసిన వారిపై కఠిన చర్యలకు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి ఆదేశించారు. ఒక మహిళపై చేయకూడని వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.

Written By: BS, Updated On : May 23, 2023 2:09 pm
Follow us on

IPL-2023 : ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమిపాలైంది. బెంగళూరు జట్టు ఓడిపోవడానికి గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సుబ్ మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ కారణం. ఈ మ్యాచ్ లో సెంచరీతో కదంతొక్కిన గిల్ బెంగళూరు జట్టు ఓడిపోవడంతోపాటు ప్లే ఆఫ్ చేరే అవకాశాన్ని కూడా దూరం చేశాడు. దీంతో బెంగుళూరు అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో గిల్ లక్ష్యంగా దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు బెంగుళూరు అభిమానులు. దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.
ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ప్లే ఆఫ్ చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు.. కోహ్లీ అద్భుతమైన సెంచరీ తో 197 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ జట్టుకు విధించింది. ఈ మ్యాచ్ లో సునాయాసంగా విజయం సాధిస్తుంది అని భావించిన బెంగుళూరు జట్టు దారుణంగా ఓటమిపాలైంది. దీనికి కారణం సుబ్ మన్ గిల్ అన్న ఉద్దేశంతో బెంగుళూరు అభిమానులు రెచ్చిపోయారు. గిల్ అతని సోదరిని లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలు పరిధి దాటి ఉండడంతో ఢిల్లీ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది. దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆదేశించింది.
గిల్ అతని సోదరిపై పరిధి దాటిన వ్యాఖ్యలు.. 
బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి గుజరాత్ జట్టుకు గొప్ప విజయాన్ని అందించి పెట్టిన గిల్ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నాడు. బెంగళూరు జట్టు ఓటమి తర్వాత ఆ జట్టు అభిమానులు రెచ్చిపోయారు. సామాజిక మాధ్యమాలు వేదికగా తీవ్ర స్థాయిలో ట్రోలింగ్స్ చేశారు. ఒక ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన కారును షేర్ చేస్తూ ఇందులో గిల్ ఉన్నాడంటూ పలువురు పోస్ట్లు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరి కొంతమంది గిల్ సోదరి షహనీల్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ పట్ల చేయకూడని వ్యాఖ్యలు చేయడంతో ఢిల్లీ మహిళా కమిషన్ రంగ ప్రవేశం చేసింది.
కఠిన చర్యలకు ఆదేశించిన ఢిల్లీ మహిళా కమిషన్..
గిల్ సోదరిపై అనుచిత వ్యాఖ్యలను చేసిన వారిపై కఠిన చర్యలకు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి ఆదేశించారు. ఒక మహిళపై చేయకూడని వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. తమకిష్టమైన జట్టు ఓడిందని గిల్ సోదరిపై ట్రోల్స్ చేయడం సిగ్గుచేటు అన్నారు. గతంలో కోహ్లీ కూతురిని దూషించిన వారిపై చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఇక బెంగళూరు జట్టు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ట్రోలింగ్స్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరహా విమర్శలు చేసే వారిని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు. కఠిన శిక్షలు పడితే ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.