Shubman Gill: టెస్ట్ సారధిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గిల్ తో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా గిల్ తన మనోగతాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పాడు..” విరాట్ కోహ్లీ నుంచి, రోహిత్ నుంచి చాలా నేర్చుకున్నాను. టెస్టులలో ఆడిన అనతి కాలంలోనే జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఇది గొప్ప బాధ్యత అని అనుకుంటున్నాను. క్రమశిక్షణ, హార్డ్ వర్క్, పర్ఫామెన్స్ విషయాలలో ఇతర ప్లేయర్లకు ఆదర్శంగా నిలవడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను. ఇంగ్లీష్ జట్టుతో జరిగే సీరియల్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఇంగ్లీష్ జట్టుతో జరిగే ఐదు టెస్టులు నాకు సవాల్.. అలాంటి సవాల్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మాత్రమే కాదు జట్టులోని మిగతా ప్లేయర్లు కూడా రెడీగా ఉన్నారు. ఐదు టెస్టులలో ప్రతి మ్యాచ్ కూడా మాకు అత్యంత ముఖ్యమైనది. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్ ను ఇంగ్లీష్ జట్టుతో జరిగే సిరీస్ తో మొదలు పెడుతున్నాం. అనుభవం, యువ ప్లేయర్లతో జట్టు సమతూకంగా ఉంది. ఖచ్చితంగా ఇంగ్లీష్ గడ్డపై సత్తా చూపిస్తుందని” గిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
క్రమశిక్షణ ముఖ్యం
వ్యాఖ్యాత అడిగిన ఓ ప్రశ్నకు.. క్రమశిక్షణను సమాధానం గా చెప్పాడు గిల్. ” జట్టులో నిలబడాలంటే సామర్థ్యం అవసరం. దాంతోపాటు క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. జట్టు పరిస్థితులకు అనుగుణంగా ఆడితేనే అవకాశాలు లభిస్తాయి. అదేవిధమైన ఆట తీరు కొనసాగిస్తే అవకాశాలు స్థిరమవుతాయి. అప్పుడిక జట్టులో కొనసాగడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.. ఇంగ్లీష్ జట్టుతో తలపడుతున్న సందర్భంగా మాకంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా ఆటతీరు కొనసాగిస్తాం.. అందులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక జట్టు విషయంలో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు లభించాయి. వచ్చిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నానని” గిల్ పేర్కొన్నాడు.
✨
Get ready to hear from #TeamIndia Test Captain Shubman Gill himself
Stay tuned for the full interview ⌛ @ShubmanGill pic.twitter.com/zWVlFdMD61
— BCCI (@BCCI) May 25, 2025
బుమ్రా సేవలు వినియోగించుకుంటాం
” బుమ్రా, రవీంద్ర జడేజా అనుభవం ఉన్న ఆటగాళ్లు. వారి సేవలను కచ్చితంగా వినియోగించుకుంటాం. గతంలో వారు ఇంగ్లీష్ జట్టుతో ఆడిన సిరీస్ లలో పాలుపంచుకున్నారు. బుమ్రా, రవీంద్ర జడేజా సలహాలు స్వీకరిస్తాను. మీరు మాత్రమే కాదు జట్టులో ఏ ఆటగాడు సలహాలు ఇస్తే.. అవి కచ్చితంగా జట్టుకు ఉపయోగపడతాయి అనుకుంటే స్వీకరిస్తాను. వాటిని అమల్లో పెడతాను. ఇంగ్లీష్ జట్టుతో జరిగే సిరీస్ అత్యంత ముఖ్యం కాబట్టి.. బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్లో కచ్చితంగా మార్పులు ఉంటాయని” గిల్ స్పష్టం చేశాడు. మొత్తంగా జట్టులో తన మార్క్ ఉండేలా చూసుకుంటానని గిల్ ఇంటర్వ్యూలో నర్మగర్భంగా చెప్పేశాడు.
