spot_img
Homeక్రీడలుక్రికెట్‌Shubman Gill Record : బ్రేకులు లేని బుల్డోజర్ లా గిల్.. టీమిండియా సారధిగా సరికొత్త...

Shubman Gill Record : బ్రేకులు లేని బుల్డోజర్ లా గిల్.. టీమిండియా సారధిగా సరికొత్త రికార్డు

Shubman Gill Record : టీమిండియా వన్డే సారథి గిల్ దూసుకుపోతున్నాడు. బ్రేకులు లేని బుల్డోజర్ లాగా రెచ్చిపోతున్నాడు. ఇటీవల ఐపీఎల్లో అదరగొట్టిన అతడు.. అదే ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ ముందు తన మీద అంచనాలను అమాంతం పెంచేసుకుంటున్నాడు.. దీంతో భారత మేనేజ్మెంట్ ఉత్సాహంతో కనిపిస్తోంది.. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో గిల్ సత్తా చూపించాడు. 66 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 88* పరుగులు చేశాడు గిల్.

సరికొత్త రికార్డు

88 పరుగులు చేసిన గిల్ తన పేరు మీద అద్భుతమైన రికార్డును లిఖించుకున్నాడు.. వన్డే ఫార్మేట్ లో టీం ఇండియా తరఫునుంచి అత్యంత వేగంగా 3000 పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.. 62 ఇన్నింగ్స్ లలో అతడు 3000 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో అతడు రెండవ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఆమ్లా కొనసాగుతున్నాడు.. కేవలం 57 ఇన్నింగ్స్లలో ఆమ్లా 3 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. గిల్ 1000 పరుగులు సాధించడానికి 19 ఇన్నింగ్స్ లు.. రెండు వేల పరుగులు సాధించడానికి 38 ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి.

కొంతకాలంగా గిల్ స్థిరమైన ఆట తీరు కొనసాగిస్తున్నాడు.. అద్భుతమైన టెక్నిక్ కంటిన్యూ చేస్తున్నాడు. ఐపీఎల్ లో అతడు ఆడిన తీరే దీనికి బలమైన నిదర్శనం.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో కూడా గిల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. 16 పరుగుల వద్ద రోహిత్ ఔట్ అయినప్పటికీ.. అయ్యర్ 12 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. భారీ లక్ష్యాన్ని గిల్ సులువుగానే చేజ్ చేయగలిగాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని సునాయాసంగా ఎదుర్కొన్నాడు.. ఎక్కడ కూడా పొరపాట్లకు అవకాశం ఇవ్వలేదు. తోటి ప్లేయర్లు అవుట్ అవుతున్నప్పటికీ.. ఒత్తిడికి గురి కాలేదు. దీంతో గిల్ నాయకత్వంలో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.

గిల్ కనుక ఇలానే ఆడితే వచ్చే వన్డే వరల్డ్ కప్ లో టీం ఇండియాకు తిరుగుండదని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. అతడి నాయకత్వంలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వన్డేలు ఆడుతున్న జట్ల నాయకులను పరిశీలిస్తే గిల్ మాత్రమే సమర్థవంతమైన నాయకుడిగా కొనసాగుతున్నాడు.. జట్టును సమర్థవంతమైన నిర్ణయాలతో ముందుకు నడిపిస్తున్నాడు. అతడు తన జోరు ఇలాగే కొనసాగిస్తే టీమిండియా 2023లో కోల్పోయిన అవకాశాన్ని మళ్లీ అందిపుచ్చుకొని.. ట్రాఫిక్ గెలిచే ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. చూడాలి మరి గిల్ ఏం చేస్తాడో..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version