Shubman Gill: మెడ కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్న టీమిండియా కెప్టెన్ గిల్.. రెండో టెస్ట్ కు కూడా దూరమయ్యాడు. అతడు టెస్టులకు మాత్రమే కాకుండా, వన్డేలకి కూడా దూరమయ్యే అవకాశం కల్పిస్తోంది. ఎందుకంటే మెడ కండరాల నొప్పి ఇంతవరకు తగ్గలేదు. పైగా అతడు దూర ప్రయాణం చేయకూడదు. విపరీతమైన ఒత్తిడి, పని భారం ఇవన్నీ కూడా గిల్ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. అందువల్లే అతడికి మెడ కండరాల నొప్పి వచ్చింది.
గిల్ టెస్ట్ సిరీస్ కు మాత్రమే కాకుండా, వన్డేలకు కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. అతని స్థానంలో ఎవరు టీమిండియా కు నాయకత్వం వహిస్తారని ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. గిల్ కంటే ముందు ఆస్ట్రేలియా సిరీస్ లో వైస్ కెప్టెన్ అయ్యర్ గాయపడ్డాడు.. అతడు కూడా గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అటు కెప్టెన్, ఇటు వైస్ కెప్టెన్ గాయాల బారిన పడిన నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా తో జరిగే వన్డే సిరీస్ కు ఎవరు నాయకత్వం వహిస్తారని ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించింది.
జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం టీమ్ ఇండియాకు కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్ నాయకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ గతంలో వన్డేలలో టీమ్ ఇండియాకు నాయకత్వం వహించాడు. అక్షర్ పటేల్ కు నాయకత్వం వహించిన అనుభవం లేదు. కాకపోతే వీరిద్దరిలో ఎవరికి ఒకరికి అవకాశం వస్తుందని తెలుస్తోంది. మరోవైపు జట్టులోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తుండడంతో.. వారు కూడా కేఎల్ రాహుల్ లేదా పటేల్ కు తమ సలహాలు, సూచనలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో గిల్ కు రోహిత్ శర్మ సలహాలు, సూచనలు అందించాడు. ముఖ్యంగా హర్షిత్ రాణా కు బౌలింగ్ ఇవ్వాలని రోహిత్ గిల్ కు సూచించాడు. అంతేకాదు బంతులు ఎక్కడ వేయాలో హర్షిత్ కు రోహిత్ పదేపదే చెప్పాడు. ఇది సత్ఫలితాలను ఇచ్చింది. అందువల్లే టీం ఇండియా మూడో వన్డేలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఒకవేళ అక్షర్ లేదా గిల్ కు కనుక మేనేజ్మెంట్ సారధ్య బాధ్యతలు అప్పగిస్తే విరాట్, రోహిత్ తమ సలహాలు సూచనలు అందిస్తారని తెలుస్తోంది. మరోవైపు రెండవ టెస్ట్ రేపటి నుంచి గుహవాటి వేదికగా జరుగుతుంది. ఈనెల 30 నుంచి సౌత్ ఆఫ్రికా తో వన్డే సిరీస్ మొదలవుతుంది.