IPL 2025: ఏ ముహూర్తానయితే ఐపీఎల్ ఈ సీజన్ మొదలైందో తెలియదు గాని.. మామూలుగా లేదు భయ్యా.. ఒక్కో మ్యాచ్ ఒక్కో తీరుగా జరుగుతోంది. సీటు చివరి ఎడ్జ్ ఆనందాన్ని అందిస్తోంది. అంతేకాదు మైదానానికి సరికొత్త అందాన్ని జతచేస్తోంది. గతంలో ఎన్నడు లేని విధంగా ఐపీఎల్ మ్యాచులకు ఈసారి యువత భారీగా పోటెత్తుతోంది. అందమైన యువతుల రాకతో సరికొత్తగా కనిపిస్తోంది. అయితే అమ్మాయిలు తమ అభిమాన జట్లకు సపోర్ట్ చేస్తున్నారు. ఇందులో తమ అభిమాన ఆటగాళ్లు ఫోర్ కొట్టినప్పుడు, సిక్సర్ బాదినప్పుడు ఎగిరి గంతులు వేస్తున్నారు. వాళ్లు అవుట్ అయినప్పుడు తీవ్రమైన నిరాశలో మునిగిపోతున్నారు. ఐపీఎల్ కెమెరా మెన్ లు మాత్రం ఈ దృశ్యాలను మిస్ కాకుండా రికార్డ్ చేస్తున్నారు. మైదానంలో అందమైన యువతులు ప్రదర్శిస్తున్న హావభావాలను పదేపదే చూపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆ యువతులు ట్రెండింగ్ పర్సనాలిటీస్ అయిపోతున్నారు. ఇటీవల చెన్నై, బెంగళూరు మ్యాచ్లలో అందమైన అమ్మాయిలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా దెబ్బకు వారు సెలబ్రిటీలు అయిపోయారు. కొంతమందికి అయితే కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా అవకాశం లభిస్తోంది. ఇటీవల బెంగళూరు జట్టు ఆడిన మ్యాచ్లో మైదానంలో సందడి చేసిన ఓ అమ్మాయికి స్విగ్గి నుంచి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక చెన్నై జట్టు ఆడిన మ్యాచ్లలో సందడి చేసిన అమ్మాయిలకు కూడా వివిధ కంపెనీల నుంచి ఆఫర్లు లభించినట్టు సమాచారం.
Also Read: ఐపీఎల్ సరికొత్త రికార్డు.. హైయెస్ట్ వ్యూయర్ షిప్ తో అరుదైన చరిత్ర
సోషల్ మీడియా షేక్
సాధారణంగా అందమైన అమ్మాయిలను చూస్తే ఎవరికైనా మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది. ఇక ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సమయంలో లెక్కకు మిక్కిలి అందమైన అమ్మాయిలు రావడంతో చూసేవాళ్ళకు కన్నుల పండుగ లాగానే ఉంది. ఇక ఐపీఎల్ కెమెరామెన్ అయితే అందమైన అమ్మాయిలను చూపించడంలో పదే పదే పోటీ పడుతున్నారు. అందమైన యువతులను మ్యాచ్ తో సమానంగా చూపిస్తున్నారంటే.. మైదానాలకు ఏ స్థాయిలో యువతులు వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో.. మన దేశపు అమ్మాయిలు మాత్రమే కాకుండా.. ఇతర దేశపు అమ్మాయిలు కూడా దర్శనమిస్తున్నారు. వారు అందంగా ముస్తాబయి.. అద్భుతంగా దర్శనమిస్తున్నారు. సౌందర్య ఆరాధకులయితే వారిని చూసి పరవశించిపోతున్నారు. ఇది కదా మాకు కావాల్సింది.. ఇది కదా మేము చూడాల్సింది అంటూ సంబర పడుతున్నారు.. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియోలో అందమైన అమ్మాయిలు లెక్కకు మిక్కిలి ఉన్నారు. అందానికి సరికొత్త నిర్వచనం ఇచ్చేలాగా.. సౌందర్యానికి సరికొత్త అర్థం చెప్పేలాగా వారున్నారు. వాళ్లను చూస్తే ఇక్కడ జరుగుతోంది ఐపీఎల్ పోటీలా? లేక మిస్ యూనివర్స్ పోటీలా? తేల్చుకోలేకపోతున్నామని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాను ఈ వీడియో షేక్ చేస్తోంది.
Beauties >>> IPL Cricket Match ❣️ pic.twitter.com/i2WDTCUyue
— Shrija (@plot_twistttt) April 26, 2025
Also Read: చెన్నై ప్లేయర్లు అవుట్ అయితే తిట్టింది.. సీన్ కట్ చేస్తే సెలబ్రిటీ అయిపోయింది.. ఇక ఆఫర్లే ఆఫర్లు..