Shubman Gill: రెండవ టెస్ట్ లో విజయం సాధించిన నేపథ్యంలో టీమిండియా మూడో టెస్ట్ కోసం జట్టులో సమూల మార్పులు చేస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని భావిస్తున్నది.. ఇందులో భాగంగానే కెప్టెన్ గిల్ కీలక నిర్ణయం వెల్లడించాడు. రెండో టెస్టు గెలిచిన తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో మూడవ టెస్ట్ కి సంబంధించి తన వైఖరిని వెల్లడించాడు. చేసే మార్పులు, కొత్తగా తీసుకొనే ఆటగాళ్లపై సంచలన విషయాలను బయటపెట్టాడు.
దారుణంగా బౌలింగ్ వేశాడు
తొలి టెస్ట్ లో ప్రసిధ్ ఐదు వికెట్లు సాధించాడు. పరుగులు మాత్రం దారుణంగా ఇచ్చాడు. ఒక రకంగా ఇండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం అతడే. తొలి టెస్టులో ఐదు వికెట్లు సాధించాడు కాబట్టి, రెండో టెస్టులో కూడా అతనికి అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో అతడు దారుణంగా తేలిపోయాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో ఓ ఓవర్లో 23 పరుగుల దాకా ఇచ్చాడు. ఒక రకంగా స్మిత్, బ్రూక్ ప్రసిధ్ బౌలింగ్ ను ఓ ఆటాడుకున్నారు. బీభత్సంగా పరుగులు తీస్తూ చెలరేగిపోయారు. అప్పట్లోనే ప్రసిధ్ ను చాలామంది విమర్శించారు.. అసలు అతడిని జట్టులోకి ఎందుకు తీసుకున్నారంటూ కెప్టెన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు.
Also Read: ఆకాశమంత ప్రతిభ.. అంతకు మించిన మనస్సు.. ఆకాశ్ దీప్ భయ్యా నీకో బిగ్ సెల్యూట్!
తప్పించడం ఖాయం
రెండవ ఇన్నింగ్స్ లో ప్రసిధ్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినప్పటికీ.. ఒక వికెట్ కూడా తీసినప్పటికీ.. అతడిని మూడో టెస్ట్ నుంచి తప్పించడం ఖాయమని కెప్టెన్ గిల్ సంకేతాలు ఇచ్చాడు. ఎందుకంటే మూడో టెస్ట్ లోకి బుమ్రా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దీని వెనుక కారణం కూడా లేకపోలేదు.. రెండో టెస్ట్ ఓడిపోయిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు మూడో టెస్టుకు మరింత పకడ్బందీగా రంగంలోకి దిగుతుంది. ఆటగాళ్ళను మార్చేస్తుంది. అసలే సొంతమైదానం.. పైగా కొత్త ఆటగాళ్లతో ఇంగ్లాండ్ జట్టులో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అలాంటివారికి కళ్లెం వేయాలంటే కచ్చితంగా బుమ్రా లాంటి సీనియర్ బౌలర్ ఉండాలని గిల్ అభిమతం గా ఉంది. అందువల్లే అతడు బుమ్రా మూడో టెస్టులో ఆడతాడని ప్రకటించాడు.
అతడికి కూడా కష్టమే..
ప్రసిధ్ కృష్ణ స్థానంలో బుమ్రా ఖాయం అనుకుంటున్న వేళ.. మరో ఆటగాడి గురించి కూడా చర్చ జరుగుతున్నది. రెండో టెస్టులో అవకాశం వచ్చినప్పటికీ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సత్తా చాటలేకపోయాడు. బ్యాటింగ్లో తొలి ఇన్నింగ్స్ లో 0, రెండవ ఇన్నింగ్స్ లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చాడు. ఇక రెండవ ఇన్నింగ్స్ లో అతడికి గిల్ బౌలింగ్ వేసే అవకాశం కల్పించలేదు.. బ్యాటింగ్లో విఫలం కావడం.. బౌలింగ్ లో సత్తా చూపించలేకపోవడంతో మూడు టెస్ట్ లో గిల్ కు అవకాశం ఉండదని తెలుస్తోంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీ చేయకపోయినప్పటికీ.. తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు.. ఇక రెండవ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసి బెన్ స్టోక్స్ లాంటి కీలక ఆటగాడి వికెట్ పడగొట్టి అదరగొట్టాడు. ఈ లెక్కన మూడో టెస్టుకు అర్ష్ దీప్ సింగ్ ను జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది..