Gill breaks Gavaskar record: సాలిడ్ రికార్డ్ సృష్టించాలంటే ఆటగాడికి నేర్పు ఉండాలి. ఓర్పు అంతకన్నా ఉండాలి. సమకాలీన క్రికెట్లో ఇవన్నీ మెండుగా ఉన్నాయి కాబట్టి గిల్ అదరగొడుతున్నాడు. తనకు మాత్రమే సాధ్యమైన క్రికెట్ ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న అతడు ఎడ్జ్ బాస్టన్ టెస్టులో అదరగొట్టాడు. బ్యాటింగ్ భారాన్ని సింహభాగం తనే మోసి సారధి అంటే ఎలా ఉంటాడో నిరూపించాడు.. ఇంగ్లాండ్ జట్టు పై భారత్ సాధించిన విజయంలో ఎక్కువ క్రెడిట్ కెప్టెన్ గిల్ కే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాట్ తో అతడు అదరగొట్టాడు. సారధిగా అద్భుతమూ చేసాడు.
విదేశీ గడ్డపై అత్యంత తక్కువ వయసులో సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్ గెలిపించిన సారధిగా నిలిచాడు. ఈ రికార్డు ఇంతకుముందు సునీల్ గవాస్కార్ పేరు మీద ఉండేది. సునీల్ గవాస్కర్ 26 సంవత్సరాల 297 రోజుల్లో వయసులో టెస్ట్ మ్యాచ్ గెలిపించాడు. అయితే గిల్ 25 సంవత్సరాల వయసు 298 రోజులు వయసులో టెస్ట్ మ్యాచ్ గెలిపించాడు. బౌలర్లకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాడు. బౌలర్లు కోరుకున్న విధంగా ఫీల్డింగ్ సెట్ చేశాడు. బౌలర్లతో పదేపదే చర్చించాడు. ప్రసిధ్ లాంటి బౌలర్ దారుణంగా పరుగులు ఇస్తున్నప్పటికీ.. అతడిని ప్రోత్సహించి చివరి ఇన్నింగ్స్ లో వికెట్ తీసేలా చేశాడు.. ఇక ఆకాష్, సిరాజ్ కు అతని ఇచ్చిన ప్రోత్సాహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
Also Read: ఆకాశమంత ప్రతిభ.. అంతకు మించిన మనస్సు.. ఆకాశ్ దీప్ భయ్యా నీకో బిగ్ సెల్యూట్!
ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్ లో సెంచరీల మోత మోగిస్తున్న గిల్.. అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.. రెండవ టెస్టులో ద్వి శతకం, శతకం సాధించి రికార్డుల మోత మోగించాడు. ఇది క్రమంలో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో 400+, లిస్ట్ ఏ మ్యాచ్ లో 200+, టి20 మ్యాచ్లో 100+, వన్డేలో 200+, టెస్టులో 400+ పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచంలో ఏ ఆటగాడికి కూడా ఇలాంటి ఘనత సాధ్యం కాలేదు. మరోవైపు రెండో మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
Also Read: ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ విజయం.. సీనియర్ క్రికెటర్లు చేసిన ట్వీట్లు వైరల్
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జైస్వాల్, రాహుల్, కరణ్ నాయర్ వంటి వారు అవుట్ అయినప్పటికీ.. రంగంలోకి వచ్చిన గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. డబుల్ సెంచరీ సాధించడమే కాకుండా.. రవీంద్ర జడేజా తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నిర్మించాడు. ఆరో వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి టీమ్ ఇండియాను అత్యంత పటిష్ట స్థితిలో నిలిపాడు. ఇక రెండవ ఇన్నింగ్స్ సమయంలోనూ గిల్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఈ ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ చేసి వారెవా అనిపించాడు. తద్వారా టీమిండియా అత్యంత పటిష్ట స్థితిలో నిలిచింది. కొండంత లక్ష్యం కళ్ళ ముందు ఉండడంతో ఇంగ్లాండు కూడా తేలిపోయింది. 336 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.