Shubman Gill and Abhishek Sharma: టీమిండియా పాకిస్తాన్ జట్టు మీద ఘనవిజయం సాధించింది. ఈసారి ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన గెలుపును దక్కించుకుంది. తద్వారా ఆసియా కప్ లో తిరుగులేని రారాజుగా తన చరిత్రను తానే సరికొత్తగా సృష్టించుకుంది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దుమ్ము రేపే స్థాయిలో పరుగులు చేశారు. వారి దూకుడుకు పాకిస్తాన్ విధించిన లక్ష్యం కరిగిపోయింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ పాకిస్తాన్ బౌలర్లకు నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపించాడు. ఎవరిని వదలకుండా తన బ్యాటింగ్ స్టామినా ఏమిటో నిరూపించాడు. అభిషేక్, గిల్ కలిసి తొలి వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పాకిస్తాన్ బౌలింగ్ మొత్తాన్ని చీల్చి చెత్తకుప్పలో పడేశారు.
అభిషేక్ శర్మ, గిల్ దూకుడు వల్ల పాకిస్తాన్ విధించిన 172 రన్స్ టార్గెట్ కరిగిపోయింది. ప్రారంభం నుంచి భారత్ దూకుడు కొనసాగించింది. అభిషేక్ అవిశ్రాంత బ్యాటింగ్ నైపుణ్యం వల్ల పరుగులు వరదలాగా వచ్చాయి. ప్రవాహం లాగా పారాయి. అందువల్లే భారత్ విజయం నల్లేరు మీద నడకయింది. వాస్తవానికి ఇటీవలి ఆసియా కప్ మ్యాచ్లలో గిల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. గొప్ప ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమయ్యాడు. అయితే అటువంటి గిల్ పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం దుమ్మురేపాడు. పోటాపోటీగా పరుగులు సాధించి అభిషేక్ తర్వాతి స్థానం నిలిచాడు. అభిషేక్ అయితే చెప్పాల్సిన పని లేకుండా అదరగొట్టాడు.
అభిషేక్, గిల్ ఔట్ అయిన తర్వాత.. డ్రెస్సింగ్ రూమ్ లో సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఎంతసేపటికి ఆ కబుర్లు ఆగిపోవడం లేదు. అభిషేక్ మాట్లాడుతుంటే గిల్ వింటున్నాడు. గిల్ మాట్లాడుతుంటే అభిషేక్ ఆసక్తిగా గమనిస్తున్నాడు. వీరిద్దరూ ఇప్పుడు మాత్రమే కాదు చిన్నప్పటి నుంచి దోస్తులు. కలిసి ఆడారు. వారిద్దరి మధ్య గాఢమైన స్నేహం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా యువరాజ్ సింగ్ తండ్రి దగ్గర వీరిద్దరు శిక్షణ తీసుకున్నారు. అందువల్లే వారి బ్యాటింగ్ అత్యంత బలంగా కనిపిస్తుంది. ఇద్దరి మధ్య సమన్వయం అద్భుతంగా ఉంటుంది. అందువల్లే టీమిండియా పాకిస్తాన్ జట్టుపై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వారిద్దరు మాట్లాడుకుంటున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆ వీడియోని చూసిన వారంతా ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. ప్రేమికులు కూడా ఇలా మాట్లాడుకోరని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
The Shubman Gill and Abhishek Sharma bond. ❤️pic.twitter.com/w9YYeeCl9P
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2025